Venezuela US Oil Deal | వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్

వెనెజువెలాతో అమెరికా చరిత్రాత్మక ఆయిల్​ ఒప్పందం చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Venezuela US Oil Deal | వెనెజువెలాతో అమెరికా చరిత్రాత్మక ఆయిల్​ ఒప్పందం చేసుకుంది. ఆ దేశంలోని చమురు రంగంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 65 బిలియన్ బ్యారెళ్లపై అగ్రరాజ్యం నియంత్రణ సాధించనుంది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ అభివర్ణించారు.

ట్రంప్​ మాట్లాడుతూ.. తమ ప్రబుత్వం వెనిజులాతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ఇది కార్యరూపం దాల్చితే ఆ దేశంలోని వెలికితీయని భారీ చమురు నిల్వలను అమెరికాకు రుసుముతో పొందే వీలు కల్పిస్తుందని అన్నారు. వెనిజుల ప్రభుత్వం ఒక ప్రకటనలో, ఈ ఒప్పందంలో 65 బిలియన్ బ్యారెళ్ల నిరూపిత సామర్థ్యం గల 17 క్షేత్రాల అభివృద్ధి ఇమిడి ఉందని తెలిపింది. ఈ ఒప్పందం వెనిజులా చమురు పరిశ్రమలోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగ్జ్ పేర్కొన్నారు. ఇది దేశ పునరుద్ధరణపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు.

Venezuela US Oil Deal | 100 ఏళ్ల హక్కులు

ఈ ఒప్పందం ప్రకారం.. వెనిజులాలోని ప్రైవేట్ ఆపరేటర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని, నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి కొత్త ప్రైవేట్ కంపెనీని ఏర్పాటు చేయడానికి అమెరికాకు వీలు కల్పిస్తుంది. చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి రోడ్రిగ్జ్ ఆ కంపెనీకి 100 సంవత్సరాల హక్కులను మంజూరు చేసినట్లు సమాచారం. కొత్త ప్రైవేట్ కంపెనీ 55శాతం వాస్తవ ఉత్పత్తి వాటాను అమెరికాకు ఇస్తుంది. వెనిజుల అప్పటి అధ్యక్షుడు నికోలస్​ను అమెరికా నిర్బంధించిన విషయం తెలిసిందే. అనంతరం ఆ స్థానంలో తనకు అనుకూలంగా ఉన్న రోడ్రిగ్జ్​ను కూర్చొబెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఆయిల్​ ఒప్పందం కుదరడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Aug 29 Gold Prices | బంగారం ధరల భగభగ.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ఎంతంటే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.