Modi Uzbekistan Visit | ఉజ్బెకిస్తాన్​ పర్యటనకు వెళ్లిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్‌ పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి బయలుదేరారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Uzbekistan Visit | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు శనివారం ఉదయం బయలుదేరారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు మీర్జియోయెవ్‌తో ప్రధాని చర్చలు జరుపుతారు.

ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. తాష్కెంట్‌లోని శాస్త్రి మెమోరియల్‌ను, తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య రంగాలలో ఇద్దరు నాయకులు సహకారాన్ని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణకు అజెండాను నిర్దేశిస్తారు.

Modi Uzbekistan Visit | ఎస్​సీవో సదస్సుకు..

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఉజ్జెకిస్తాన్​ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే బిష్కెక్‌లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, ఆ ప్రాంతంతో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడంపై ఈ పర్యటన లక్ష్యం. వికసిత్​ భారత్​, యాంగీ ఉజ్బెకిస్తాన్ అనే మన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంపైనా జరపబోయే చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Hyderabad MMTS AC Coaches | ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో లోకల్‌ రైళ్లలో ఏసీ ప్రయాణం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *