అక్షరటుడే, వెబ్డెస్క్ : MIM MLC Suspended | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అత్తాపూర్లో బాలికపై అనుచితంగా ప్రవర్తిస్తుండగా పలువురు యువకులు ఆయనను పట్టుకొని కొట్టారు. ఈ మేరకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవి డీప్ ఫేక్ వీడియోలు అని ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పార్టీ మాత్రం ఆయనపై చర్యలు తీసుకుంది.
MIM MLC Suspended | రాజీనామా చేయాలి
ఆరోపణల నేపథ్యంలో ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ బేగ్‌ను సస్పెండ్ చేశారు. అంతేగాకుంఆ ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేస్తూ శాసనమండలి చైర్మన్‌కు లేఖ సమర్పించాలని అసదుద్దీన్ ఆదేశించారు. స్థానిక సంస్థల కోటా నుంచి బేగ్ 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవికాలం 2029 మే వరకు ఉంది. ఈ ఉదంతం అధిష్టానానికి ముందే తెలిసినా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని పలువురు ఆరోపించారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ఇప్పుడు చర్యలు తీసుకున్నారని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Hyderabad MMTS AC Coaches | ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలో లోకల్ రైళ్లలో ఏసీ ప్రయాణం!