అక్షరటుడే వెబ్‌డెస్క్: Godrej Oil Palm Partnership Malaysia | భారత్-మలేషియా మధ్య వ్యాపార, పారిశ్రామిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మలేషియా ప్లాంటేషన్ అండ్ కమోడిటీస్ మంత్రి వైబీ డాటుక్ సెరీ డాక్టర్ నొరైని అహ్మద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలు ఉన్న ఆయిల్ పామ్ ఆవిష్కరణలు, గృహోపకరణాల క్రిమిసంహారక రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.
Godrej Oil Palm Partnership Malaysia | అధునాతన పరిశోధనలు..
గోద్రెజ్ ఆగ్రోవెట్‌తో జరిగిన చర్చల్లో భాగంగా ఇరు వర్గాలు ఆయిల్ పామ్ అప్‌స్ట్రీమ్ రంగంలోని అవకాశాలపై దృష్టి పెట్టాయి. భారతదేశంలోని భిన్నమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసేందుకు నూతన శాస్త్రీయ సాధనాలు, పరిశోధనలను ఉపయోగించడంపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ తరహా సహకారం ద్వారా స్థానికంగా మెరుగైన దిగుబడులు సాధించడంతో పాటు, భారతదేశ దీర్ఘకాలిక వంటనూనెల (ఎడిబుల్ ఆయిల్) భద్రతకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.
Godrej Oil Palm Partnership Malaysia | క్రిమిసంహారక రంగంపై దృష్టి..
అలాగే, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో జరిగిన భేటీలో గృహోపకరణాల క్రిమిసంహారక రంగం వృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించడంపై చర్చించారు. సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే వాణిజ్యాన్ని, నూతన ఆవిష్కరణలను వేగవంతం చేయడంపై ఇరు వర్గాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి.
Godrej Oil Palm Partnership Malaysia | నాయకుల స్పందన..
ఈ సందర్భంగా మలేషియా మంత్రి నొరైని అహ్మద్ (Noraini Ahmad ) మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి, ఆహార భద్రతకు దోహదపడే రంగాలలో భారత్-మలేషియా మధ్య బలమైన బంధం ఉందని తెలిపారు. పరిశోధన, వాణిజ్యం, సుస్థిరతలో ఈ భాగస్వామ్యం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ రాకేష్ స్వామి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ, వినియోగదారుల అవసరాలను తీర్చడంలో విజ్ఞాన మార్పిడి ఎంతో కీలకమని, ఈ సహకారం ఇరు దేశాల రైతులు, వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Anantapur RTC Driver | ఫ్రీ బస్సే కదా.. మూసుకొని ఎక్కు: మహిళను బూతులు తిట్టిన డ్రైవర్