May 10 Gold Prices | బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 10 Gold Prices | గత కొన్ని వారాలుగా వరుసగా రికార్డు స్థాయికి చేరుతున్న బంగారం, వెండి ధర‌ల‌కి Silver Prices ఇటీవ‌ల కొంత బ్రేక్ ప‌డింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులు, పెట్టుబడిదారుల ధోరణి ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో కూడా ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

May 10 Gold Prices | తెలుగు రాష్ట్రాల్లో..

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,235 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,650గా నమోదైంది. వెండి ధర కూడా కిలోకు రూ.2,62,350 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,39,650గా ఉంది. వెండి ధర కిలోకు రూ.2,62,350గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

May 10 Gold Prices | ప్ర‌ధాన నగ‌రాల‌లో..

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,53,010, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,260గా ఉంది. బెంగళూరు, కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,350 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో Chennai మాత్రం ధరలు మరింత ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,54,370 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,500గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,52,500 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,39,800 వద్ద ట్రేడవుతోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారంపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతుండటం కూడా బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. సాధారణంగా ఆయిల్ రేట్లు Oil Rates పెరిగినప్పుడు ద్రవ్యోల్బణ భయాలు పెరిగి, బంగారం కొనుగోళ్లు అధికమవుతాయి. అదే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిస్థితులు కొనసాగితే రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షల మార్క్‌ను కూడా తాకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నగలు కొనుగోలు చేయాలనుకునేవారు ధరలు కొద్దిగా తగ్గిన సమయంలో కొనడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు పెట్టుబడి కోణంలో చూస్తే, బంగారం ఎప్పటికీ దీర్ఘకాలికంగా లాభదాయక ఆస్తిగానే కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Bandi Sanjay Statement | కొడుకుపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన బండి సంజయ్.. ఎక్స్​ వేదికగా వివరణ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *