YSRCP Criticism | వైసీపీ శవరాజకీయాలు చేస్తుంది.. జగన్ నిర్ణయాల వల్ల బీసీలు, దళితులు నష్టపోతున్నారంటూ మంత్రి విమ‌ర్శ‌లు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్:YSRCP Criticism | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి స‌విత వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె… అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి తెరలేపారు. మంత్రి సవిత మాట్లాడుతూ, టీడీపీ (Telugu Desam Party) సమాజం కోసం మంచి చేసే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అయితే, వైసీపీ YSR Congress Party హంతకులను తయారు చేసే ఫ్యాక్టరీలా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

YSRCP Criticism | జగన్‌పై తీవ్ర ఆరోపణలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy)పై కూడా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హత్యలు చేయడం, సాక్షులను బెదిరించడం, డబ్బులు మాట్లాడటం, కుటుంబ సభ్యులు, జడ్జిలను కూడా భయపెట్టే ప్రయత్నాలు చేయడం జగన్‌కు అలవాటైపోయిందని ఆరోపించారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు కూడా “శవ రాజకీయాలు” చేస్తున్నారని మండిపడ్డారు.

YSRCP Criticism | మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం

అనంత బాబు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ మంత్రి సవిత (Minister Savita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంత బాబును జగన్ ప్రోత్సహించడంతోనే దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య జరిగిందని ఆరోపించారు. ఇది జగన్ సైకో ధోరణికి పరాకాష్టగా నిలిచిందని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఏవైనా లోపాలు జరిగి ఉండొచ్చేమో కానీ, ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని చెప్పారు. జగన్ పాలనలో బలైన వారిలో బీసీలు, దళితులే ఎక్కువగా ఉన్నారని మంత్రి సవిత ఆరోపించారు. చంపడం, రౌడీలను, గూండాలను తయారు చేయడమే వైసీపీ పని అయిపోయిందని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Solar Plant | రాంబిల్లిలో మెగా సోలార్ ప్లాంట్.. శంకుస్థాపన చేసిన సీఎం!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *