అక్షరటుడే వెబ్‌డెస్క్: Shakeela health issue | అతిగా మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల ప్రముఖ నటి షకీల తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నారు. ఫోన్ వాడకం ఎక్కువైపోవడం వల్ల తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని, చివరకు రూ.3 లక్షలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. ఫోన్‌లో గంటల తరబడి గేమ్స్ ఆడటం, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని షకీల వెల్లడించారు. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే సమయంలో ఒక పక్కకు వాలి గంటల కొద్దీ ఫోన్ చూడటం వల్ల మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడిందని ఆమె పేర్కొన్నారు.
Shakeela health issue | అభిమానులకు హెచ్చరిక..
ఈ సందర్భంగా అభిమానులకు షకీల కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు చెప్పారు. “ఫోన్ మనకు అవసరమే, కానీ దానిని మోతాదుకు మించి వాడకండి. ఉపయోగం లేని వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఒకవేళ మొబైల్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే డబ్బులు నష్టపోవడంతో పాటు, భరించలేని నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వడంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించాలి” అని ఆమె విజ్ఞప్తి చేశారు.
Shakeela health issue | షకీల సినీ ప్రయాణం ఇలా..
కేవలం 18 ఏళ్ల వయసులో ‘ప్లే గర్ల్స్’ అనే తమిళ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసిన షకీల.. 2000 సంవత్సరంలో విడుదలైన మలయాళ చిత్రం ‘కిన్నార తుంబికల్’తో ఓవర్ నైట్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘నిజం’, ‘బంగారం’, ‘తొట్టిగ్యాంగ్’ వంటి పలు తెలుగు చిత్రాల్లోనూ ఆమె కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
Actress #Shakeela Warns Against Excessive Smartphone Use After Neck Surgery
Veteran actress #Shakela recently underwent neck surgery after suffering severe nerve damage, which she attributed to prolonged smartphone use. She revealed that spending hours lying sideways in bed… pic.twitter.com/NwOcdru9qS
— Milagro Movies (@MilagroMovies) August 13, 2026
ఇది కూడా చదవండి: Jurala Project Flood | జూరాలకు తగ్గిన వరద..