అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jurala Project Flood | ఎగువన కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కృష్ణనది పరివాహక ప్రాంతంలో వానలు తగ్గడంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద తగ్గింది.
జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal District)లోని జూరాల ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం 28 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో గేట్ల ద్వారా నీటివిడుదలను అధికారులు నిలిపివేశారు. విద్యుత్ ఉత్పత్తి, ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
Jurala Project Flood | 185 టీఎంసీలకు చేరిన శ్రీశైలం
జూరాల నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. బుధవారం 51,296 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా గురువారినికి 26,939 క్యూసెక్కులకు తగ్గింది. సాగునీరు, తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తుండటంతో, అవుట్ ఫ్లో 71,176 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 185.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 30 టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్ట్ నిండుకుండలా మారనుంది.కృష్ణా నదిపై కర్ణాటకలోని జలాశయాలు నిండాయి. తెలంగాణలోని జూరాల సైతం నిండుకుండలా మారింది. మరికొన్ని రోజులు వరద వస్తే శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం నాగర్జున సాగర్‌కు మాత్రం వరద రావడం లేదు. శ్రీశైలం గేట్లు ఎత్తితే సాగర్‌కు భారీగా వరద వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Rayadurg Land | రాయదుర్గం భూముల వేలం ఆపాలి : హరీశ్‌రావు