Stock Market Gains | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 362 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్లు పడిపోయాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains |ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడానికి తాను మద్దతు ఇస్తానని యూఎస్ ఫెడ్ గవర్నర్ వాలర్ చేసిన వ్యాఖ్యలతో గ్లోబల్ మార్కెట్లు కోలుకున్నాయి. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పైనా కనిపించింది. వరుసగా నాలుగు సెషన్లపాటు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ (Nifty).. శుక్రవారం పుంజుకుని లాభాలతో ముగిశాయి.

Stock Market Gains | గ్యాప్ అప్ లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 505 పాయింట్ల భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా తొలుత అమ్మకాల ఒత్తిడితో 128 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 354 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 15 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 110 పాయిట్లు పైకి ఎగబాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో లాభాలు క్షీణించాయి. చివరికి సెన్సెక్స్ 362 పాయింట్ల లాభంతో 76,515 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 23,897 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,482 కంపెనీలు లాభపడగా 1,901 స్టాక్స్ నష్టపోయాయి. 235 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 191 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 100 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్ లాభపడగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్ 2.91 శాతం, రిలయన్స్ 1.61 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.47 శాతం, ట్రెంట్ 1.34 శాతం, అదానీ పోర్ట్స్ 1.33 శాతం లాభపడ్డాయి.

Top losers : ఎయిర్‌టెల్ 1.24 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.24 శాతం, ఎటర్నల్ 1.09 శాతం, ఆసియన్ పెయింట్ 0.48 శాతం, టీసీఎస్ 0.48 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: ESDS Software Solutions IPO | అ‘ధర’గొట్టిన ఐపీవో.. తొలిరోజే రెట్టింపైన పెట్టుబడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *