Symbiotec Pharmalab IPO | పబ్లిక్ ఇష్యూకు ఫార్మా ల్యాబ్ కంపెనీ.. గ్రే మార్కెట్‌లో భారీ డిమాండ్

సింబయోటెక్ ఫార్మా ల్యాబ్ ఐపీవోకు వస్తోంది. ఆగస్టు 24 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Symbiotec Pharmalab IPO | సింబయోటెక్ ఫార్మా ల్యాబ్ ఐపీవోకు వస్తోంది. ఆగస్టు 24 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. 30 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఫార్మాస్యూటికల్ మరియు బయోటెక్నాలజీ సంస్థ. దీని సామర్థ్యాలు ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ మరియు కాంప్లెక్స్ ఇంజెక్టబుల్స్ అనే మూడు రంగాలలో విస్తరించి ఉన్నాయి. మందుల తయారీలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాలైన కార్టికోస్టెరాయిడ్, స్టెరాయిడల్ హార్మోన్ ఏపీఐలను తయారు చేసే సింబయోటెక్ ఫార్మా ల్యాబ్ .. ఒక చిన్న ప్రయోగశాల స్థాయి స్టెరాయిడ్ తయారీదారు నుంచి పూర్తి సమీకృత ప్రపంచ సంస్థగా ఎదిగింది.

ఏపీఐల గ్లోబల్ మార్కెట్‌లో సింబయోటెక్ బలమైన వాటాను కలిగి ఉంది. కార్టికోస్టెరాయిడ్, స్టెరాయిడల్ హార్మోన్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఉంది.

Symbiotec Pharmalab IPO | రూ. 1,757 కోట్ల సమీకరణ లక్ష్యం..

ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,757 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్ల వాటాల విక్రయం ద్వారా రూ. 1,607 కోట్లు సమీకరించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ రుణ బకాయిల మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని చెల్లించడం, సాధారణ కార్పొరేట్ అవసరాలకోసం వినియోగించనున్నారు.

Symbiotec Pharmalab IPO | ఆఫర్ ఫర్ సేలే అధికం..

కంపెనీ ఐపీవో ద్వారా సమీకరిస్తున్న మొత్తంలో ఆఫర్ ఫర్ సేల్ తాజా ఇష్యూ పరిమాణంకంటే 10 రెట్లకుపైగా ఉంది. అంటే ఈ ఆఫర్‌ను కంపెనీ సొంత వృద్ధి లేదా బ్యాలెన్స్ షీట్ అవసరాల కోసం మూలధనాన్ని సమీకరించడం కోసం కాకుండా ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను నగదుగా మార్చుకోవడానికి వినియోగించుకుంటున్నారు.

Symbiotec Pharmalab IPO | ప్రైస్ బ్యాండ్..

ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 938 నుంచి రూ. 988 మధ్య నిర్ణయించారు. ఒక లాట్ లో 15 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,820 తో దరఖాస్తు చేసుకోవచ్చు.

కోటా..

క్యూఐబీలకు 50 శాతం వాటాను కేటాయించిన కంపెనీ.. రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం వాటాను కేటాయించింది.

జీఎంపీ..

కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో షేరుకు జీఎంపీ రూ. 380 లుగా ఉంది. ఒకవేళ ఐపీవో అలాట్ అయితే సుమారు 38 శాతం లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి.

ఐపీవో తేదీలు..

ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 24న ప్రారంభమై ఆగస్టు 27 ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ ఆగస్టు 28న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 1న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కంపెనీ షేర్లు లిస్ట్ కానున్నాయి.

ఇది కూడా చదవండి..: Skyways Air Services IPO | రేపటి నుంచి అందుబాటులోకి లాజిస్టిక్ కంపెనీ ఐపీవో..

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *