Indian Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 561 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 561 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 159 పాయింట్లు కోల్పోయాయి.

పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో మూడు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ వేస్తూ మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది.

Indian Stock Market | భారీ నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 344 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా తర్వాత కోలుకుని 130 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 401 పాయింట్లు పడిపోయింది. 143 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. 89 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి 134 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 561 పాయింట్ల నష్టంతో 77,054 వద్ద, నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 24,052 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

Indian Stock Market

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,501 కంపెనీలు లాభపడగా 2,737 స్టాక్స్ నష్టపోయాయి. 195 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 134 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 64 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్ లాభపడగా.. 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎయిర్‌టెల్ 1.65 శాతం, టీసీఎస్ 0.89 శాతం, సన్‌ఫార్మా 0.84 శాతం, టాటా స్టీల్ 0.64 శాతం, అదానీపోర్ట్స్ 0.59 శాతం లాభపడ్డాయి.

Top losers : హెచ్సీఎల్ టెక్ 4.42 శాతం, ఇండిగో 2.30 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.21 శాతం, ఎస్బీఐ 2.13 శాతం, ఎం అండ్ ఎం 2.10 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: LIC Premium Payment | LIC కీలక నిర్ణయం.. ఇకపై క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్స్ బంద్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *