అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana SIR Process | తెలంగాణలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కోరింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ 15 శాతం కూడా పూర్తి కాలేదని, బీఎల్ఓలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తాము అధికారులను కోరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కుంగిపోయిందని, రక్తం ప్యాకెట్లతో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. “ప్రాజెక్టు కూలడానికి కారణం బీఆర్ఎస్ పార్టీనే. వారి కుట్రలను గ్రామాల వారీగా ప్రజలకు వివరిస్తాం” అని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ (NDSA) ఇచ్చే నివేదిక ఆధారంగానే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని, ఇంజనీర్ల సలహాలను పాటిస్తామని చెప్పారు.
Telangana SIR Process | ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?:
గత రెండు సంవత్సరాలుగా మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కరువు పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు. “మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టులపై రాజకీయం చేయడం మానుకోవాలి. ఎన్డీఎస్ఏ నివేదిక రాకుండా, ప్రాజెక్టులో నీటిని నింపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ నీళ్లు నింపిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అని మంత్రి ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ రావు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాలే తప్ప, లేనిపోని ఆరోపణలు చేయవద్దని హెచ్చరించారు.
Telangana SIR Process | ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాం..
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని, కేంద్రంతో పోరాటంలో అందరూ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అనేక మంది శాస్త్రవేత్తలు ఎల్ నినో ప్రభావంతో వాతావరణ శాఖ వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయింది.. రక్తం పాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు..
కాళేశ్వరం కూలడానికి కారణం brs.. ఊరూరూ తిరిగి brs కుట్రలు ప్రజలకు… pic.twitter.com/TiDgvf6sR6
— Ponnam Prabhakar (@Ponnam_INC) July 14, 2026
ఇది కూడా చదవండి: Ketan Agarwal Murder | ప్రధాని మోదీకి కేతన్ తల్లి లేఖ