Traffic Restrictions | దూల్​పేటలో రేపటి నుంచి ట్రాఫిక్​ ఆంక్షలు

వినాయక విగ్రహాల తరలింపు నేపథ్యంలో దూల్​పేటలో రేపటి నుంచి ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని దూల్​పేటలో రేపటి నుంచి ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 14 వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు.

దూల్​పేట వినాయక విగ్రహాల తయారీకి పేరుగాంచిన విషయం తెలిసిందే. నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి భారీ ప్రతిమలను తీసుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 5 ఉదయం 7 గంటల నుండి సెప్టెంబర్ 14 రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Traffic Restrictions | ఇతర వాహనాలకు నో ఎంట్రీ

దూల్​ పేటలోని బోయిగూడ కమాన్​, గాంధీ విగ్రహం మధ్య సాధారణ ట్రాఫిక్ రాకపోకలు పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఆఘాపూర, గోడే కే కబర్​, జిన్సి, టక్కర్​వాడి మీదుగా వాహనాలను మళ్లిస్తారు. విగ్రహాలను తరలించే వాహనాలు గాంధీ విగ్రహం / పురానాపూల్ మీదుగా వెళ్లాలి. విగ్రహాలను తరలించే వాహనాలు బోయిగూడ కమాన్ క్రాస్ రోడ్స్ మీదుగా బయటకు వెళ్లవచ్చు

Traffic Restrictions | ట్రాఫిక్ మళ్లింపులు

మంగళహాట్ నుంచి టక్కర్‌వాడి T-జంక్షన్, జిన్సీ చౌరస్తా ఘోడే-కీ-ఖబర్ వెళ్లాలి. సీతారాంబాగ్ నుంచి అఘాపుర, జిన్సీ, జుమ్మేరాత్ బజార్ మీదుగా పురానాపూల్ చేరుకోవాలి. లారీలు, డీసీఎంలను జుమ్మేరాత్ బజార్ గ్రౌండ్​, 100 అడుగుల రోడ్డు, పురానాపూల్​లో పార్కింగ్​ చేయాలి. రాత్రి 10 గంటల తర్వాతే విగ్రహాలను తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.

దీనిని కూడా చదవండి : Harish Rao Comments | కొండా సురేఖపై యాక్షన్.. మరి పొంగులేటిపై ఎందుకు లేదు?: రేవంత్‌‌కు హరీశ్ రావు ప్రశ్న

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *