అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 26 Market Analysis | క్రూడ్ ఆయిల్(Crude oil) ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గుతుండడంతో స్టాక్ మార్కెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగియగా.. బుధవారం ఆసియా మార్కెట్లు సైతం పాజిటివ్ గా ప్రారంభమయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Aug 26 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.66 శాతం, ఎస్ అండ్ పీ 0.32 శాతం లాభపడగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.07 శాతం నష్టంతో ఉంది.
Aug 26 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.37 శాతం నష్టపోగా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.61 శాతం, యూకేకు చెందిన FTSE 0.29 శాతం లాభంతో ముగిశాయి.
Aug 26 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.04 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.72 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.53 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.50 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.35 శాతం లాభంతో.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.21 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.32 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 1,593 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు వరుసగా పన్నెండో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 230 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 95.41 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 86.15 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.91 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.64 వద్ద ఉన్నాయి.