అక్షరటుడే వెబ్‌డెస్క్: KA Paul Peace | ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్ , గ్యాస్ ధరలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల వల్లే సామాన్యులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన 58 యుద్ధాల కారణంగా దాదాపు 200 దేశాల్లోని 850 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
KA Paul Peace | అందని ద్రాక్షలా మారాయి..
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు నుంచి మొదలైన ఇరాన్ యుద్ధం ఆరు నెలలుగా కొనసాగుతుండటంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారాయని వాపోయారు. గతంలో వంద రూపాయలు ఉన్న వస్తువులు ఇప్పుడు 200 మూడొందలకు చేరాయని, రెండు డాలర్లుగా ఉన్న పెట్రోల్, గ్యాస్ ( Gas )ధరలు నాలుగు, ఐదు డాలర్లకు పెరిగాయని వివరించారు. ధనికులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, సమాజంలోని 90 శాతం మంది సాధారణ ప్రజలు ఈ ఆర్థిక నష్టాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దుస్థితి అంతమై ధరలు అదుపులోకి రావాలంటే ప్రపంచంలో శాంతి నెలకొనడం ఎంతో అవసరమని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఆ శాంతిని కాంక్షించే సెప్టెంబర్ 28న వాషింగ్టన్ డీసీ వేదికగా ప్రత్యేక శాంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: KTR Allegations | కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసుల తీరు : కేటీఆర్