తెలంగాణTelangana Urban Housing | పేదల సొంతింటి కల నిజం చేస్తూ ప్రభుత్వ సంచలన నిర్ణయం.....

Telangana Urban Housing | పేదల సొంతింటి కల నిజం చేస్తూ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. CURE పరిధిలో లక్ష గృహాల నిర్మాణానికి ఆమోదం!

గతంలో 2 BHK ఇళ్ల పథకం కోసం ఆమోదించిన ప్రత్యేక టెండర్/ప్రొక్యూర్మెంట్ నిబంధనల సడలింపులనే ఈ అఫర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్‌కు కూడా వర్తింపజేస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Urban Housing | తెలంగాణ రాష్ట్రంలోని అల్పాదాయ (LIG), మధ్య ఆదాయ (MIG) వర్గాల ప్రజలకు భారీ ఊరటనిస్తూ ప్రభుత్వం అద్భుతమైన వరం ప్రకటించింది.

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధి, మున్సిపల్ కార్పొరేషన్లలో లక్ష (1.00 Lakh) సరసమైన ధరల సొంత గృహాల (Affordable Urban Housing) నిర్మాణ ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు – భవనాల (గృహనిర్మాణ) శాఖ జీవో ఎంఎస్ నంబర్ 23 (G.O.Ms.No. 23) ని జారీ చేసింది.

తెలంగాణ గృహనిర్మాణ బోర్డు వైస్ ఛైర్మన్ & హౌసింగ్ కమిషనర్ పంపిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన ప్రభుత్వం.. రాష్ట్ర గవర్నర్ పేరిట కార్యదర్శి (FAC) వి.పి. గౌతమ్ ద్వారా ఈ చారిత్రాత్మక ఉత్తర్వులను విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ పీఎంఏవై-యూ 2.0 (PMAY-U 2.0) మార్గదర్శకాలకు, హౌసింగ్ బోర్డు నిబంధనలకు లోబడి, ఎటువంటి బడ్జెట్ భారం లేకుండా బోర్డు సొంత వనరుల ద్వారానే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుండటం విశేషం.

Telangana Urban Housing | పైలట్ ప్రాజెక్ట్ కింద 12 వేల ఇళ్లు..

ఈ గృహనిర్మాణ పథకంలో భాగంగా డిమాండ్ సర్వే ఆధారంగా LIG మరియు MIG కేటగిరీలలో 70:30 నిష్పత్తిలో ఇళ్లను నిర్మించనున్నారు. అంటే మొత్తం లక్ష ఇళ్లలో 70,000 ఫ్లాట్లు అల్పాదాయ వర్గాలకు (LIG), 30,000 ఫ్లాట్లు మధ్య ఆదాయ వర్గాలకు (MIG) కేటాయించబడుతాయి.

కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు గాను, ప్రాథమికంగా CURE పరిధిలో 12,000 ఫ్లాట్ల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా తక్షణమే ప్రారంభించేందుకు గృహనిర్మాణ కమిషనర్‌కు అనుమతులు మంజూరయ్యాయి.

akshara today .jpgLIG

Telangana Urban Housing | ఎల్​ఐజీ లబ్ధిదారులకు ఉచితంగా భూమి..

అల్పాదాయ వర్గాల (LIG) పై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సర్కారు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.

అర్హులైన LIG లబ్ధిదారులకు ల్యాండ్ కాస్ట్ (భూమి ఖర్చు) ఏమాత్రం భారం కాకుండా పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ ల్యాండ్​ విలువను ప్రభుత్వం, బోర్డు ఈక్విటీగా పరిగణిస్తుంది. ప్రతి LIG ఫ్లాట్‌కు రూ. 5.00 లక్షల నగదు సబ్సిడీని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

పీఎంఏవై, హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల పేరుతోనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్, అవిభాజ్య భూమి వాటా (Undivided Share of Land) బదిలీ ప్రక్రియ ఉంటుంది.

akshara today .jpgGO

Telangana Urban Housing | ఉత్తర్వుల్లోని ప్రధానాంశాలు:

స్థలాల సేకరణ: TGHB, DILL, TGRSCL మరియు ఇతర ప్రభుత్వ/బోర్డు ఆధీనంలో ఉన్న స్థలాలను ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తారు. ల్యాండ్ టైటిల్, ఈసీ, ల్యాండ్ యూజ్, రోడ్ యాక్సెస్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తనిఖీలను కలెక్టర్లు పూర్తి చేయాలి.

డిమాండ్ సర్వే: పారదర్శక లబ్ధిదారుల ఎంపిక కోసం గృహనిర్మాణ కమిషనర్ అధికారికంగా డిమాండ్ సర్వే నోటిఫికేషన్లు, స్కీమ్ నిబంధనలను జారీ చేస్తారు.

ఫాస్ట్ ట్రాక్ టెండర్లు: గతంలో 2 BHK ఇళ్ల పథకం కోసం ఆమోదించిన ప్రత్యేక టెండర్/ప్రొక్యూర్మెంట్ నిబంధనల సడలింపులనే (G.O.RT.NO.62 ప్రకారం) ఈ అఫర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్‌కు కూడా వర్తింపజేస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Telangana Urban Housing | ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు..

మొత్తం మంజూరైన ఇళ్లు: లక్ష సరసమైన గృహాలు (Affordable Flats)

కేటాయింపుల నిష్పత్తి: 70:30 (LIG : MIG)

LIG ఫ్లాట్లు: 70,000 ఫ్లాట్లు

MIG ఫ్లాట్లు: 30,000 ఫ్లాట్లు

పైలట్ ప్రాజెక్ట్ పరిధి: CURE ఏరియాలో 12,000 ఫ్లాట్లు

LIG ఆర్థిక ప్రయోజనాలు: ఉచిత భూమి (Free Land) + రూ. 5.00 లక్షల సబ్సిడీ

అమలు చేయు సంస్థ: తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB)

ఈ చారిత్రాత్మక జీవో విడుదల కావడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో మగ్గుతున్న వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ద్వారా పక్కా గృహ యోగం కలగనుంది. త్వరితగతిన డిమాండ్ సర్వే పూర్తి చేసి, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసే దిశగా గృహనిర్మాణ శాఖ తుది కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

Supreme Court Sex Workers | సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పోలీసులకు, మీడియాకు సంచలన మార్గదర్శకాలు!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...

Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు..! నగరంలో కలకలం రేపిన ఘటన..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు...