Sanathnagar TIMS | అంతర్జాతీయ ప్రమాణాలతో టిమ్స్​ ఏర్పాటు చేశాం : కేటీఆర్​

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sanathnagar TIMS | దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేశామని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) అన్నారు. శుక్రవారం ఆయన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​తో కలిసి సనత్​నగర్​ టిమ్స్​ను సందర్శించారు.

సనత్​ నగర్ టిమ్స్​ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. జూన్​లో ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasimha) తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం అందులో ట్రయల్​ రన్​ కొనసాగుతోంది. తాజాగా కేటీఆర్​ ఆస్పత్రిని సందర్శించి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. బసవతారకం ఆస్పత్రి బయట రోడ్డు మీద రోగుల అటెండెంట్స్ పడుకోవడం చూసి.. టిమ్స్ ఆసుపత్రి కట్టే సమయంలోనే అలాంటి వారి కోసం 200 పడకలతో ధర్మశాలను కేసీఆర్ కట్టించారని చెప్పారు.

Sanathnagar TIMS | రూ.1200 కోట్లతో..

అన్ని రకాల సదుపాయాలతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని కేసీఆర్ రూ.1200 కోట్లతో ప్రారంభించారని కేటీఆర్​ చెప్పారు. ఆసుపత్రే కాకుండా.. పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకడమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్​ (KCR) ఏర్పాటు చేశారని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆలోచనతో జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మించారని గుర్తు చేశారు. కాగా టిమ్స్​లో 1000 పడకలు ఉంటాయి.

ఇది కూడా చదవండి..: Bandi Sanjay Son Posters | ‘పోస్టర్’ రోగం.. తెలంగాణలో కొత్త రాజకీయం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *