అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kargil War | తీవ్రవాదం, మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల వంటి అంశాలపై పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై భారత్ (India) ఆగ్రహం వ్యక్తం చేసింది.జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల గురించి, ఇతర అంతర్గత అంశాల గురించి మాట్లాడే నైతిక హక్కు పాక్‌కు ఏమాత్రం లేదని స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి భావికా మంగళానందన్ మత స్వేచ్ఛ, నమ్మకం అనే అంశంపై చర్చలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన తమ సైనికుల మృతదేహాలను స్వీకరించడానికి కూడా పాకిస్థాన్ నిరాకరించిందని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం సమర్పించారు .సొంత సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించని ఒక దేశం, మత స్వేచ్ఛ, అంత్యక్రియల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. భారత సైన్యమే పాకిస్థానీ సైనికుల మృతదేహాలకు సైనిక గౌరవాలతో, ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిందని ఆమె తెలిపారు.
Kargil War | పీవోకేపై దృష్టి పెట్టాలి
భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌లో ఏం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్న పాక్, తన అక్రమ ఆధీనంలో ఉన్న కశ్మీర్ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాలని ఆమె హితవు పలికారు. ఆ దేశంలో మైనారిటీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని, వారి హక్కులు నిరంతరం ఉల్లంఘనకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సొంత మైనారిటీలకే రక్షణ కల్పించలేని దేశానికి, భారతదేశానికి నీతులు చెప్పే అర్హత లేదన్నారు.
ఇది కూడా చదవండి..: Diwali Bonus Rules | బోనస్ ఇవ్వకపోతే.. బాస్‌పై కేసు!