HYDRAA Demolitions | ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ భవనాలు తొల‌గిస్తాం : హైడ్రా క‌మిష‌న‌ర్‌

గచ్చిబౌలిలోని అంజయ్యనగర్​లో ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చి వేస్తున్నట్లు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA Demolitions | గచ్చిబౌలి (Gachibowli)లోని అంజయ్యనగర్​లో ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చి వేస్తున్నట్లు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ మయాంక్ సింగ్​తో క‌లిసి సోమ‌వారం ప్ర‌మాద‌క‌ర భ‌వ‌నాల తొల‌గింపు ప‌నుల‌ను ప‌రిశీలించారు.

శేరిలింగంప‌ల్లి మండ‌లం అంజ‌య్య‌న‌గ‌ర్‌లో శ‌నివారం 7 అంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలిపోగా.. ప‌క్క‌నే ఉన్న మ‌రో 7 అంత‌స్తుల భ‌వ‌నం ప్ర‌మాద‌క‌రంగా మారింది. సైబరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​, హైడ్రా ఆధ్వర్యంలో దానిని కూల్చి వేస్తున్నారు. సోమ‌వారం కూడా ఈ ప‌నులు కొనసాగాయి. ప‌క్క‌నే మ‌రి కొన్ని భ‌వ‌నాలు కూడా ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో.. వాటిని కూడా ప‌రిశీలించి తొల‌గించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు హైడ్రా (Hydraa) కమిషనర్ తెలిపారు.

HYDRAA Demolitions | కబ్జాలతో..

వ‌ర‌ద కాలువ‌ను కొంత మేర క‌బ్జా చేసి 50 గ‌జాల స్థ‌లాల్లో ఏడెనిమిది అంత‌స్తులు నిర్మించ‌డంతోనే ఆ భ‌వ‌నాల ప‌టిష్ట‌త దెబ్బ‌తినింద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. 50 గ‌జాల స్థ‌లంలో రెండు అంత‌స్తుల‌కు అనుమ‌తులు తీసుకుని పిల్ల‌ర్లు, పునాదులు ఆ మేర‌కే వేసి.. ఆ పైన 7 అంత‌స్తుల భ‌వ‌నాలు క‌ట్ట‌డంతో సామ‌ర్థ్యం స‌రిపోని ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌న్నారు. అనుమ‌తులు లేకుండా.. నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా నిర్మించిన భ‌వ‌నాల‌తో ప‌క్క‌నే ఉన్న క‌ట్ట‌డాల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ప‌క్క‌నే ఉన్న అపార్టుమెంట్లు, భ‌వ‌నాల‌కు ఎలాంటి ముప్పు లేకుండా దెబ్బ‌తిన్న‌ భ‌వ‌నాల తొల‌గింపులో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

దీనిని కూడా చదవండి : Police Officers Association | పోలీసు అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *