Ponguleti Srinivas Reddy | 22ఏపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి పొంగులేటి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్‌: Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో 22ఏలో లక్షలాది ఎక‌రాలు చేర్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 2023 డిసెంబర్ 7 నాటికి ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, ఏ కేటగిరీ భూములు ఎంత మేర నిషేధిత జాబితాలో ఉన్నాయో పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నట్లు తెలిపారు.

22ఏ పేరిట ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్దాంతాన్ని సృష్టిస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. 22ఎ పేరిట ఇంత‌వ‌ర‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేష‌న్లు పూర్త‌య్యాయ‌ని చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చే నాటికి నిషేధిత జాబితాలో ఉన్న ఫారెస్ట్, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ప్రైవేట్ భూములు తదితర వివరాలను కేటగిరీల వారీగా విడుద‌ల చేశారు. సోమ‌వారం ఆయన స‌చివాల‌యంలో మీడియాతో మాట్లాడారు.

Ponguleti Srinivas Reddy | రెండు ప్లాట్లు మాత్రమే..

హైద‌రాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లో సర్వే నంబర్ 403కు సంబంధించి సుమారు 1,280 ఎకరాల విస్తీర్ణం ఉండగా, అందులో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి తెలిపారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు రికార్డులు అప్‌లోడ్ చేసే సమయంలో మొత్తం సర్వే నంబర్‌ను పేర్కొనడంతో ముఖ్య‌మంత్రి గారి నివాసంతో పాటు త‌న నివాసం కూడా పీఓబీలో చేర్చార‌ని.. దానిని గుర్తించి వెంట‌నే స‌రిచేశామ‌ని తెలిపారు. భూదాన్, అసైన్డ్, ప్రభుత్వ భూముల విషయంలో రికార్డులను కేసుల వారీగా పరిశీలించి, వాస్తవ హక్కుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Ponguleti Srinivas Reddy | వేగంగా సమస్యల పరిష్కారం

ఇప్పటికే రిలాక్సేషన్ పొందిన 22ఏ కేసుల్లో సుమారు 98 శాతం స్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. సుమారు 300కు పైగా స్లాట్లలో దేవాదాయ, భూదాన్ తదితర కారణాలతో రిజిస్ట్రేషన్‌కు వీలు లేని 12–13 కేసులను మాత్రమే తిరస్కరించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన వారికి ఈ వారాంతంలోపు ఆ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. 22ఏకు సంబంధించిన నిజమైన సమస్యలను 24 గంటల్లో, అవసరమైన సందర్భాల్లో గరిష్ఠంగా 36 గంటల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : HYDRAA Demolitions | ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ భవనాలు తొల‌గిస్తాం : హైడ్రా క‌మిష‌న‌ర్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *