Hyderabad Development Projects | రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

శంకర్‌పల్లి రోడ్‌లో ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్‌లైన్ రోడ్డు నిర్మాణానికి రూ.110 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. కొల్లూరు ఇంటర్‌చేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల వరకు నాలుగు లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి రూ.29.25 కోట్లతో శంకుస్థాపన చేశారు. 

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hyderabad Development Projects | రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్​లోని మియాపూర్‌లో మొత్తం రూ.1,674.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా రవాణా, విద్య, పట్టణాభివృద్ధి, మహిళా సంక్షేమం వంటి కీలక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.

Hyderabad Development Projects | సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

కార్యక్రమంలో భాగంగా రూ.161 కోట్ల వ్యయంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే మియాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రూ.530 కోట్లతో నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు శ్రీకారం చుట్టారు.

శేరిలింగంపల్లిలో రూ.308 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) పనులకు శంకుస్థాపన చేశారు. బాచుపల్లిలో రూ.65.53 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రజలకు అంకితం చేశారు.

akshara today .jpgpublic

Hyderabad Development Projects | ప్రధాన వంతెన నిర్మాణానికి

ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిసర ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం రూ.229 కోట్లతో ప్రధాన వంతెన నిర్మాణం, కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది.

అలాగే శంకర్‌పల్లి రోడ్‌లో ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్‌లైన్ రోడ్డు నిర్మాణానికి రూ.110 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. కొల్లూరు ఇంటర్‌చేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల వరకు నాలుగు లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి రూ.29.25 కోట్లతో శంకుస్థాపన చేశారు. నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమ వైపు ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు రూ.26.50 కోట్లతో పనులు చేపట్టనున్నారు.

Hyderabad Development Projects | వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణానికి

విద్యా రంగంలో భాగంగా రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మహిళల వసతి సౌకర్యాల మెరుగుదల కోసం మాదాపూర్, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో రూ.14.40 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా నగర మౌలిక వసతులు మరింత బలోపేతం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గి, విద్య, సామాజిక మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Telangana Education Budget | కుర్చీలు మారినా.. క్లాస్​రూం తలరాత మారలే: బడ్జెట్​లో విద్యకు​ కేటాయింపులపై ప్రొఫెసర్ ఎంఏ​ మాలిక్​ విమర్శ

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *