AI Complaint App | ఏఐతో ఫిర్యాదుల నమోదు.. హైదరాబాద్​ పోలీసుల కీలక అడుగు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: AI Complaint App | హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీని వినియోగిస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు కలగకుండా, వారి ఫిర్యాదులను త్వరితగతిన, కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైట‌ర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్​లోని టీజీఐసీసీసీలో శనివారం ఏఐ కాప్‌రైట‌ర్ యాప్​ను హైదరాబాద్ సీపీ సజ్జనార్​ (Hyderabad CP Sajjanar) ఆవిష్కరించారు.

నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా, బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు తక్షణమే రికార్డు చేసి, ట్రాన్స్​లేట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాష అర్థం కాక ఎఫ్.ఐ.ఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదవ్వడం వంటి సమస్యలకు ఈ యాప్ స్వస్తి పలకనుంది. 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను ఈ యాప్​ గుర్తించనుంది.

AI Complaint App | వేగంగా ఫిర్యాదుల నమోదు

హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే ఈ యాప్​ దానిని రాతపూర్వక రూపంలోకి మారుస్తుంది. పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదిస్తుంది. ఈ యాప్​తో గంటల తరబడి పట్టే ఫిర్యాదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అద‌న‌పు సీపీ(క్రైమ్స్ అండ్ సిట్) ఎం శ్రీనివాసులు, అద‌నపు సీపీ(లా అండ్ ఆర్డ‌ర్) త‌ఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ సీహెచ్ రూపేష్, ఐటీ సెల్ ఇన్​స్పెక్ట‌ర్ ర‌మేశ్ త‌దితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: POLYCET Results | పాలిసెట్​ ఫలితాలు విడుదల

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *