అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Ganesh Immersion Deaths | తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాలు కొన్నిచోట్ల తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పండుగ సందర్భంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ చేదు వార్తను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా వెల్లడించారు. అత్యంత విచారకరమైన విషయమేమిటంటే.. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) కూడా ఉన్నారు.
Telangana Ganesh Immersion Deaths | వివిధ దుర్ఘటనల వల్ల..
రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన వేడుకల సమయంలో జరిగిన వివిధ దుర్ఘటనల వల్ల ఈ ప్రాణనష్టం సంభవించినట్లు డీజీపీ తెలిపారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఓ ఎస్సై రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. పఠాన్‌చెరువులో ఆరుగురు యువకులు, ఖైరతాబాద్ , నిర్మల్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అలాగే డీజే సౌండ్స్ వల్ల కలిగిన గుండెపోటుతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వివరించారు. ఇలా వివిధ ఘటనల్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Ganesh Immersion Deaths | ఈ ఏడాది నిమజ్జన గణాంకాలు..
ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి డీజీపీ కొన్ని ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.24 లక్షల వినాయక విగ్రహాలను మండపాల్లో ప్రతిష్టించారు. ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్‌మెంట్లలో ప్రజలు స్వయంగా పెట్టుకున్న విగ్రహాలను కూడా కలుపుకుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య ఏకంగా 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
Telangana Ganesh Immersion Deaths | పోలీసులు భారీ బందోబస్తు..
రాష్ట్రంలోని వివిధ జలాశయాలు, చెరువుల వద్ద నిమజ్జన వేడుకలు కోలాహలంగా సాగాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల రద్దీని నియంత్రించడానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు భద్రతను పకడ్బందీగా పర్యవేక్షించారు. ఇంత విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, జరిగిన ఈ దురదృష్టకర ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగడం ఉత్సవాల్లో విషాదఛాయలు అలుముకునేలా చేసింది.
13 lives lost during #Ganesh #immersions in #Telangana: @TelanganaDGP @CVAnandIPS
🔹 13 people, including an SI, died during the festivities.
🔹 26 people were injured.
🔹 1.24 lakh #Ganeshidols were installed at #publicplaces across the state.
🔹 An estimated 3.5–4 lakh… pic.twitter.com/DGKp3I6Rb5
— NewsMeter (@NewsMeter_In) September 26, 2026
ఇది కూడా చదవండి: Congo Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. 14 మంది దుర్మరణం