అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nursing Home | ఆ ఆస్పత్రిలో వారం రోజుల్లో ఇద్దరు పేషెంట్లు మృతి చెందారు. దీంతో అధికారులు దానిని సీజ్ చేశారు. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా (NTR District) తిరువూరు MVS నర్సింగ్ హోమ్‌లో వారం రోజుల్లో ఇద్దరు రోగులు చనిపోయారు. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు దానిని సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయొద్దని స్పష్టం చేశారు.
Nursing Home | డెంటిస్టు మృతితో..
ఎంవీఎస్ సర్జికల్ అండ్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్‌లో తాజాగా దీప్తి అనే మహిళ చనిపోయింది. డెంటిస్టుగా పని చేస్తున్న ఆమె డెలివరీ అనంతరం మృతి చెందింది. వారం క్రితం ఇదే ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి కుమారి అనే మహిళ చనిపోయింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్ తెలంగాణలోని కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నాడు. అక్కడ పని చేస్తునే ఇక్కడ సొంతగా ఆస్పత్రి పెట్టుకున్నాడు.
గతంలోనూ రమేష్ చేసిన ఆపరేషన్లు వికటించి పలువురు చనిపోయినట్లు సమాచారం. అయితే బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చి విషయం బయటకు రాకుండా సెటిల్మెంట్లు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేగాకుండా రమేష్ మద్యం తాగి ఆపరేషన్లు చేస్తారనే ఆరోపణులు సైతం ఉన్నాయి. దీంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Tata Power EV Charging | ఏపీలో టాటా పవర్ సరికొత్త రికార్డు.. తొలి 240 kW అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం