అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Pulse Polio | ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు (Polio Vaccination) వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మాణానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు(Additional Collector Bhujanga Rao) పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
Pulse Polio | లక్ష్యాన్ని చేరుకోవాలి..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో (Nizamabad) నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతిఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లాలో ఎంతమంది చిన్నారులు ఉన్నారు.. అవసరమైన డోసుల వాక్సిన్ అందుబాటులో ఉందా అని ప్రోగ్రామ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
