Jyeshtha Purnima 2026 | జ్యేష్ఠ పౌర్ణమి వేళ అరుదైన శుభయోగం.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందే మార్గాలివే!

రేపు (సోమవారం జూన్ 29) జ్యేష్ఠ పౌర్ణమి. ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఇవాళ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jyeshtha Purnima 2026 | రేపు (సోమవారం జూన్ 29) జ్యేష్ఠ పౌర్ణమి. ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ( horoscope ) ఇవాళ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు మూల నక్షత్రంలో, గురువు రాశిలో ఉండటం వల్ల అరుదైన శుభయోగం ఏర్పడుతోంది. ఈ గ్రహస్థితి వల్ల భక్తులకు మానసిక, శారీరక ప్రశాంతతతో పాటు బుద్ధిపరమైన రక్షణ లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Jyeshtha Purnima 2026 | గ్రహ స్థితి – విశేషం..

ఈ పౌర్ణమి రోజున చంద్రుడు షోడశ కళలతో పరిపూర్ణంగా ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రుడి ఇంట్లో గురువు, గురువు ఇంట్లో చంద్రుడు ఉండే ‘రాశి పరివర్తన’ ఈ పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. చంద్రుడు తన కిరణాలను భూమిపైకి ప్రసరింపజేస్తాడు. పంచభూతాలలో సముద్రుడిపై చంద్రుడి ప్రభావం అధికంగా ఉన్నట్లే, భూమిపై నివసించే మనపై కూడా ఈ కిరణాల ప్రభావం విశేషంగా ఉంటుంది. ఈ కిరణాలు మనిషికి ఆనందాన్ని, వికాసాన్ని, చైతన్యాన్ని కలుగజేస్తాయి. సూర్యభగవానుడి కిరణాలు చంద్రుడిపై పడి, ఆ సమ్మిళితమైన కిరణాలు మనపై ప్రసరించడం వల్ల ఆత్మ చైతన్యానికి, సంకల్ప వికాసానికి ఎంతో దోహదపడతాయి. సూర్య, చంద్రులు తల్లిదండ్రులతో సమానమని, వారి ఆశీస్సులు ఈ పౌర్ణమి రోజున మనకు అందుతాయని నమ్మకం.

Jyeshtha Purnima 2026 | లక్ష్మీదేవి ఆరాధన..

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పౌర్ణమి రోజున విశేష పూజలు చేయడం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల బుద్ధిబలం, సంపద, ఆరోగ్యం లభిస్తాయి.

Jyeshtha Purnima 2026 | పఠించాల్సిన మంత్రాలు..

లక్ష్మీదేవిని ప్రార్థించేటప్పుడు భక్తులు ఈ క్రింది పవిత్ర మంత్రాలను జపించాలని సూచించడమైనది:

“ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మీహి ప్రచోదయాత్”
“ఓం వసుంధరాయే నమః, వసుంధర లక్ష్మీ దేవతాయే నమః”

సకల శుభాలను ప్రసాదించే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున, పైన పేర్కొన్న విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

ఇది కూడా చదవండి:  Revanth Reddy Nalgonda | తోడేళ్లలా తిరుగుతున్నారు”.. కేసీఆర్, హరీశ్‌ రావులపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *