Jay Shah ICC Chairman | ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక..

అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా జై షా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jay Shah ICC Chairman | అంతర్జాతీయ క్రికెట్ మండలి (International Cricket Council) ఛైర్మన్‌గా జై షా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన బోర్డు సమావేశాల్లో డైరెక్టర్ల ప్రతిపాదన మేరకు ఆయనను రెండోసారి ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఐసీసీ నవంబర్ 16న అధికారికంగా ప్రకటించింది.

ఈసారి కూడా ఆయనకు పోటీగా మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. 2024 ఆగస్టులో తొలిసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికై, డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టిన జై షా.. ఇప్పుడు వరుసగా రెండోసారి అంతర్జాతీయ క్రికెట్ పరిపాలన బాధ్యతలను కొనసాగించనున్నారు. అయితే, కొత్త పదవీకాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎంతకాలం ఉంటుందనే పూర్తి వివరాలను బోర్డు త్వరలోనే వెల్లడించనుంది.

Jay Shah ICC Chairman | గుజరాత్ క్రికెట్ సంఘం నుంచి ..

2009లో క్రికెట్ పరిపాలనలోకి అడుగుపెట్టిన జై షా అంచెలంచెలుగా ఎదిగారు. 2013లో గుజరాత్ క్రికెట్ సంఘం (GCA) జాయింట్ సెక్రటరీగా పనిచేసిన ఆయన, 2019లో బీసీసీఐ కార్యదర్శిగా, 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐపీఎల్ మీడియా హక్కుల భారీ ఒప్పందం, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.

Jay Shah ICC Chairman | జై షా ముందున్న కీలక లక్ష్యాలు..

క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా కొత్త దేశాలకు విస్తరించడమే తన ప్రధాన లక్ష్యమని జై షా గతంలోనే స్పష్టం చేశారు. ముఖ్యంగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడం ఇందుకు గొప్ప అవకాశమని ఆయన భావిస్తున్నారు. బాలిలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో 2027-29, 2029-31 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చక్రాలు, 2028-2035 మధ్య పురుషుల ప్రధాన టోర్నీల షెడ్యూల్‌పై కీలక చర్చలు జరిగాయి. మూడు ఫార్మాట్ల మధ్య సమతుల్యత, మహిళల క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించడం వంటి కీలక అంశాలపై రెండో విడతలో జై షా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇది కూడా చదవండి..: U19 Asia Cup Final | ఉత్కంఠ పోరులో పాక్‌ చిత్తు.. అండర్‌-19 ఆసియా కప్‌ విజేతగా భారత్‌!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *