Warehouse Fire | హైదరాబాద్​లో భారీ అగ్నిప్రమాదం.. గోదాములో చెలరేగిన మంటలు

హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్​లోని వద్ద గల ఫర్నిచర్​ గోదాములలో భారీగా మంటలు చెలరేగాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Warehouse Fire | హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం చెలరేగింది. గుడిమల్కాపూర్​లోని మొఘలాఖానాల వద్ద ఓ ఫర్నిచర్​ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

Warehouse Fire | కాలిబూడిదైన ఫర్నిచర్​

అగ్నిప్రమాదంలో గోదాములోని ఫర్నిచర్ కాలి బూడిదైంది. తొలుత ఓ గిడ్డంగికి మంటలు చెలరేగగా.. అనంతరం పక్కనే మరో మూడింటికి వ్యాపించాయి. ఇలా నాలుగు గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే చాలా గోదాములు ఉండటంతో యజమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Toxic Event Accident | టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం.. పలువురికి గాయాలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *