Narsingi Underpass Opening | ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. కొత్త అండర్​ పాస్​ ప్రారంభం

మై హోమ్​ అవతార్​ జంక్షన్​ వద్ద కొత్త అండర్​ పాస్​ను సైబరాబాద్​ పోలీసులు గురువారం ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Narsingi Underpass Opening | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని నార్సింగి, పుప్పలగూడ మార్గంలో మై హోమ్​ అవతార్​ జంక్షన్​ వద్ద కొత్త అండర్​ పాస్​ను సైబరాబాద్​ పోలీసులు గురువారం ప్రారంభించారు. దీంతో అక్కడ ట్రాఫిక్​ కష్టాలు కొంత మేర తీరనున్నాయి.

మై హోమ్​ అవతార్​ జంక్షన్​ నిత్యం రద్దీగా ఉంటుంది. ఐటీ కారిడార్​ అయిన గచ్చిబౌలి, మాదాపూర్​, హైటెక్​సిటికి ఈ మార్గంలోనే రాకపోకలు సాగుతాయి. నూతన అండర్​పాస్​ అందుబాటులోకి రావడంతో జంక్షన్​ వద్ద యూ టర్న్​ చేయడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది. దీంతో నానక్​రామ్​ గూడ, క్రిన్స్​ విల్లాస్​ తదితర ప్రాంతాల వైపు వెళ్లే వాహనదారులు జంక్షన్ వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.

Narsingi Underpass Opening | ప్రయాణ సమయం ఆదా

ఈ అండర్​పాస్​తో జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. నూతన సదుపాయం అందుబాటులోకి రావడంపై స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్​ ట్రాఫిక్​ డీసీపీ, ఏసీపీ, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Keesara Police Bribery | స్టేషన్​ బెయిల్ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *