Hyderabad heavy rain | భారీ వర్షంతో మునిగిన హైదరాబాద్‌.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad heavy rain | రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ Telangana లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం గ్రేటర్​ నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా మాదాపూర్ పరిధిలో భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Hyderabad heavy rain | నాలాలో పడిపోయిన డెలివరీ బాయ్

మాదాపూర్ ప్రాంతంలో రహదారులపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ బైక్‌తో సహా ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. గమనించిన స్థానిక పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) సిబ్బంది తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ డెలివరీ బాయ్‌ను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

Hyderabad heavy rain | భారీగా ట్రాఫిక్ జామ్

వర్షం తగ్గడంతో ఒక్కసారిగా వాహనదారులు రోడ్లపైకి వచ్చాయి. దీంతో ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా సాగాయి.

మాదాపూర్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కిక్కిరిసిన వాహనాలతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Hyderabad heavy rain | పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.

భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్.

మోస్తరు వర్షాలు: హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు అత్యవసరమైతేనే బయటకు రావాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *