Konda Surekha Rakhi | కొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్న : సీఎం రేవంత్​ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్​ విజయం సాధిస్తుందని సీఎం రేవంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha Rakhi | కాంగ్రెస్​ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నకిరేకల్​లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్​ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుత‌మైన ప‌థ‌కాల‌ను తీసుకువ‌స్తే కొంత మంది దుర్మార్గులు, స‌న్నాసులు ప్ర‌భుత్వం ఫెయిల్ అయిందంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పూట వ‌చ్చే గంగిరెద్దుల్లా తిరుగుతు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 2034 నాటికి కోటీ మంది ఆడ‌బిడ్డ‌ల‌కు కోటీశ్వ‌రుల‌ను చేయాల‌ని ప్ర‌తి వ్యాపారంలో అవ‌కాశం క‌ల్పిస్తున్నామని సీఎం తెలిపారు. కేసీఆర్​ హయాంలో మహిళలను పట్టించుకోలేదన్నారు.

Konda Surekha Rakhi | సంస్కారం ఉండటంతోనే..

కేసీఆర్ (KCR) త‌న బిడ్డ‌ల‌కు, బంధువుల‌కు ఉద్యోగాలు ఇస్తే తాము శంక‌ర‌మ్మ, చాక‌లి ఐల‌మ్మ మ‌న‌మ‌రాలికి ప‌ద‌వులు ఇచ్చామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హ‌యాంలో పేదోళ్ల బిడ్డ‌ల‌కు ప‌ద‌వులు వ‌చ్చాయా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చ‌దువు వ‌స్త‌దో రాదో కాని సంస్కారం ఉందన్నారు. సంస్కారం లేక‌పోతే ఒక్క‌డు కూడా రోడ్డు మీద కాలు పెట్ట‌డు.. ఫామ్ హౌస్​లో ప‌డుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంస్కారం ఉంది కాబ‌ట్టే సీత‌క్క‌, కొండా సురేఖను ఇంట్లోకి పిలిచి రాఖీ క‌ట్టించుకున్నాని సీఎం తెలిపారు. సొంత చెల్లిని మెడ ప‌ట్టి ఆస్తి కోసం బ‌య‌ట‌కు నెట్టిన వ్యక్తికి, తనకు పోలికా అన్నారు.

Konda Surekha Rakhi | ఆస్తి కోసం ఇంట్లో నుంచి గెంటేశాడు

కేసీఆర్ బిడ్డ తీహార్ జైలు నుంచి ఇంటికిపోతే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని కేటీఆర్ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు గెంటేశారని సీఎం ఆరోపించారు. పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారని, ఇలాంటోడు కోటీ మంది ఆడ‌బిడ్డ‌ల బాగోగులు చూస్తాడా అని ప్రశ్నించారు. పుట్టింటికి ఆడ‌బిడ్డ వ‌స్తే ఇంట్లోకి పిలిచి ఇంత అన్నం పెడ‌తారు.. సొంత చెల్లి ని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు నెడితే కొడుకును మంద‌లించ‌కుండా కేసీఆర్ ఫామ్ హౌస్​లో ప‌డుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో జీతం తీసుకుంటున్న కేసీఆర్​ అసెంబ్లీకి రావాలని, లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

దీనిని కూడా చదవండి : Palm Oil Paneer | పామాయిల్​తో పనీర్​ తయారీ.. 3 డెయిరీల లైసెన్సులు రద్దు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *