అక్షరటుడే వెబ్‌డెస్క్: Kitchen Adventures | ప్రస్తుత కాలంలో పిల్లలు అన్నం తినాలంటే ఫోన్ లేదా టీవీ ఉండాల్సిందే. ఈ అలవాటును మార్చి, భోజన సమయాన్ని ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మార్చేందుకు గోద్రెజ్ విక్రోలి కుచినా, చెఫ్ అనాహిత ధోండీ కలిసి సరికొత్త ప్రయోగాన్ని ప్రారంభించారు. ‘కిచెన్ అడ్వెంచర్స్’ ద్వారా భోజనపు పళ్ళెమే ఒక బెడ్‌టైమ్ స్టోరీలా మారి, పిల్లలకు విలువైన జీవిత పాఠాలను నేర్పిస్తోంది.
Kitchen Adventures | ఆందోళనకరమైన నిజం..
హర్యానాలో ఏమ్స్ (AIIMS) 2025లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భోజన సమయంలో పిల్లలకు డివైజ్‌లు (ఫోన్/టీవీ) ఇవ్వడం వల్ల వారిలో స్క్రీన్ సమయం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి పదిమంది తల్లిదండ్రులలో ఒకరు పిల్లలు అన్నం తినడం కోసం స్క్రీన్‌ను ఆశ్రయిస్తున్నట్లు ఒప్పుకుంటున్నారు. సమస్య కేవలం అన్నం తినిపించడం కాదు.. ఆ సమయంలో వారిని స్క్రీన్‌కు దూరంగా ఉంచడం. కొత్త క్లాసులు, స్నేహితులు, ప్రపంచం గురించి ఎన్నో సందేహాలతో ఇంటికి వచ్చే పిల్లలకు, ఈ భోజన సమయమే ఒక గొప్ప అవకాశం.
Kitchen Adventures | ‘బబ్స్, ది బ్యాలెన్స్‌డ్ బన్నీ బౌల్..
చెఫ్ అనాహిత ధోండీ సృష్టించిన ఈ ‘బన్నీ బౌల్’ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో భాగంగా గోద్రెజ్ జెర్సీ పెరుగు, బీట్‌రూట్ జ్యూస్ , పనీర్‌లను ఉపయోగించి తయారుచేసిన సాఫ్ట్ పింక్ శాండ్‌విచ్‌తో బబ్స్ ముఖాన్ని రూపొందించారు. ఇది “ప్రతి బన్నీ ప్రత్యేకమైనదే” అనే సందేశాన్ని ఇస్తూ, విభిన్న దృక్పథాలను గౌరవించాలని పిల్లలకు నేర్పిస్తుంది. ఇక బన్నీకి అమర్చిన పర్పుల్ , గ్రీన్ క్యాబేజీ ఆకులతో కూడిన చెవులు రంగుల వివక్షను పక్కన పెట్టి, అందరూ సమానమేనని , స్నేహానికి ఎవరైనా అర్హులేనని తెలియజేస్తాయి. అలాగే, చెర్రీ టమోటాలు, నల్ల ఆలివ్ ముక్కలు , ఉల్లికాడలతో చేసిన మీసాలు, పిల్లలలో వ్యక్తిగత గుర్తింపును, తమకు నచ్చినట్లు ఉండే స్వేచ్ఛను , నిర్ణయాధికారాన్ని ప్రోత్సహిస్తాయి. చివరిగా, పాలకూర అన్నంపై బబ్స్‌ను ఉంచి, నారింజ ముక్కలతో తయారుచేసిన బో-టై (Bowtie) ద్వారా, జీవితంలో తీపి, పులుపు వంటి కష్టసుఖాలు రెండూ ఎలా ముఖ్యమో , ఎప్పుడూ సమతుల్యతను (Balance) ఎలా కాపాడుకోవాలో అద్భుతమైన రీతిలో వివరిస్తారు.
Kitchen Adventures | నిపుణుల మాట..
చెఫ్ అనాహిత ధోండీ మాట్లాడుతూ.. “భోజన సమయం అనేది మీకూ, మీ పిల్లలకు మధ్య అద్భుతమైన క్షణం. ఆ సమయంలో మాట్లాడుకోవడానికి ఒక మంచి విషయాన్ని అందించడమే బబ్స్ చేసే పని” అని తెలిపారు. గోద్రెజ్ జెర్సీ మార్కెటింగ్ హెడ్ శాంతను రాజ్ మాట్లాడుతూ.. “భారతీయ ఇళ్లలో విలువలు పంచుకునే అనుభవాల ద్వారానే అందుతాయి. స్క్రీన్ల వాడకం పెరుగుతున్న ఈ కాలంలో, పోషకాహారం కేవలం శారీరక ఎదుగుదలకు మాత్రమే కాదు.. పిల్లల్లో మంచి విలువలను, ఆలోచనలను నింపే ఒక సాధనంగా మారుతోంది. ఆహారం ద్వారా పిల్లలకు దయ, వ్యక్తిగత గుర్తింపు , జీవిత బ్యాలెన్స్‌ను నేర్పించడం సులభం” అని పేర్కొన్నారు. పిల్లలు ఆ ప్లేట్‌లోని అన్నం తినేలోపే.. విశాలమైన ఆలోచనలు, సామరస్యం, వ్యక్తిగత గుర్తింపు, బ్యాలెన్స్ అనే నాలుగు గొప్ప విషయాలను నేర్చుకుంటారు. ఫోన్ లేదా టీవీతో పోరాడాల్సిన అవసరం లేకుండానే, గోద్రెజ్ జెర్సీ పోషకాలతో కూడిన ఈ అద్భుతమైన ప్లేట్ పిల్లల శ్రద్ధను ఆకర్షించి, వారిని ఆరోగ్యంగా, విజ్ఞానవంతులుగా మారుస్తుంది.
ఇది కూడా చదవండి: Nitin Nabin Telangana Visit | తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రేేపు రాష్ట్రానికి నితిన్ నబిన్