RTC JAC protest plan | ఆర్టీసీ జేఏసీ రేపటి కార్యాచరణ ప్రకటన.. ఉదయం 5 గంటల నుంచే మహాధర్నా!

Naresh Chandan
RTC JAC protest plan

అక్షరటుడే, వెబ్​డెస్క్​: RTC JAC protest plan | తెలంగాణ ఆర్టీసీ జేఏసీ రేపటి (గురువారం) కార్యాచరణను ప్రకటించింది. సమ్మెను మరింత ఉద్ధృతం చేసే దిశగా జేఏసీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఉదయం 5 గంటల నుంచే మహా ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

RTC JAC protest plan | కమిటీ చేతులెత్తేసింది..

సమ్మె మొదటి రోజున కార్మికులు చూపిన ఐక్యత, పోరాటస్ఫూర్తికి జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. సమస్యలను పరిష్కరించలేమని కమిటీ చేతులెత్తేసిందని జేఏసీ నేతలు ఆరోపించారు.

RTC JAC protest plan | ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలి..

కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021 వేతన సవరణను కనీసం 30 శాతం తగ్గకుండా అమలు చేయడం ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని కూడా జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అదేవిధంగా, ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులను సైతం వెంటనే వెనక్కి తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. కార్మిక సంఘాలను పునరుద్ధరించి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Vijayawada college harassment | ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *