అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Update | తెలంగాణలో లోటు వర్షపాతం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఆదివారం అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం మోస్తరు వర్షాలు పడ్డాయి. అయితే ఆదివారం వానలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు వీస్తాయి. కామారెడ్డి, మెదక్ (Medak), సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత, రాత్రి వరకు అక్కడక్కడా స్వల్పకాలిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది.
Weather Update | ములకలపల్లిలో అత్యధికంగా..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షాలు కురిశాయి. కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి మెదక్, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లిలో అత్యధికంగా 32.5 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. కొత్తగూడలో 30.8, దుగ్గొండి 30.5, ఆత్మకూరు 27.5, బూర్గంపాడు 27.3, హసన్పర్తి 23.3, దుబ్బాక 22, కాశీబుగ్గ 20.3, బిచ్కుందలో 17 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
దీనిని కూడా చదవండి : AI Shiva Song Balochistan | నెట్టింట మార్మోగుతున్న’శివ బోలో.. బలూచిస్తాన్ ఆజాద్’: ఏఐ సృష్టించిన అద్భుత ఆధ్యాత్మిక, సాంస్కృతిక గీతం!