అక్షరటుడేవెబ్‌డెస్క్: Taxation Amendment Bill 2026 | దేశంలోకి విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు – 2026’కు లోక్‌సభ ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం తెలిపింది. విదేశీ మదుపరులకు అనుకూలంగా ఉండే ఈ బిల్లు, సాధారణ పౌరులు వినియోగించే యూపీఐ లావాదేవీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Taxation Amendment Bill 2026 | మారిన నిబంధనలు..
ప్రస్తుతం యూపీఐ, రూపే కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై బ్యాంకులు వ్యాపారుల నుంచి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయడం లేదు. అయితే 2020 నుంచి అమలవుతున్న ఈ నిబంధనను తాజా బిల్లు తొలగించింది. దీనిద్వారా భవిష్యత్తులో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు బ్యాంకులకు వెసులుబాటు లభించింది. అయితే ఈ ఛార్జీలు తక్షణమే అమల్లోకి రావని, ఒకవేళ అమలు చేసినా కేవలం భారీ లావాదేవీలు నిర్వహించే పెద్ద వ్యాపారులపైనే ఈ భారం పడే అవకాశం ఉందని సమాచారం. కూరగాయలు, టీ కొట్లు వంటి చిరు వ్యాపారులపై దీని ప్రభావం ఉండదని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Taxation Amendment Bill 2026 | విదేశీ పెట్టుబడులకు పెద్దపీఠ..
విదేశీ ఫండ్ మేనేజర్లు ఎలాంటి పన్ను భయాలు లేకుండా భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా నిబంధనలను సులభతరం చేశారు. దీనివల్ల దేశీయ మార్కెట్లలోకి విదేశీ నిధులు పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REIT), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT) లలో మదుపు చేసే సామాన్యులకు గుడ్‌న్యూస్ దక్కింది. వీరికి లభించే డివిడెండ్లపై కొత్త పన్ను విధానంలోనూ ఎలాంటి పన్ను ఉండదు.
Taxation Amendment Bill 2026 | ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహం..
మొబైల్స్, లాప్‌టాప్‌లు తయారీ చేసే భారతీయ ఫ్యాక్టరీలకు యంత్రాలను సరఫరా చేసే విదేశీ కంపెనీలకు పన్ను మినహాయింపును మరో పదేళ్ల పాటు పొడిగించారు. అలాగే విదేశీ వజ్రాల వ్యాపారులు, డేటా సెంటర్లను నిర్వహించే క్లౌడ్ కంపెనీలకు కూడా పన్ను రాయితీలు ప్రకటించారు. ఈ బిల్లు ద్వారా స్వల్పకాలిక ఉపశమనంతో పాటు, దీర్ఘకాలికంగా గ్లోబల్ క్యాపిటల్‌ను భారత్‌కు ఆకర్షించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ‘గ్రాంట్ థార్న్టన్ భారత్’ ప్రతినిధి రిచా సాహ్నీ విశ్లేషించారు.
🚨 బ్రేకింగ్ న్యూస్
UPI చెల్లింపుల పై ఛార్జీలకు లోక్‌సభ ఆమోదం..!
యూపీఐ (UPI) లావాదేవీల పై ఛార్జీలు విధించేందుకు అవకాశం కల్పించే చెల్లింపులు, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది..
అయితే సాధారణ వ్యక్తుల మధ్య జరిగే P2P (Person-to-Person) లావాదేవీలు… pic.twitter.com/sPsJauzqPV
— iNews Telugu (@inewstelugu) August 6, 2026
ఇది కూడా చదవండి: DIET Deputation | ‘డైట్ డిప్యుటేషన్ల’లో అక్రమాలు.. అభ్యర్థుల ఆందోళన