KTR Kaleshwaram Water | నీరు లేక రైతుల ఇబ్బందులు.. వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలు : కేటీఆర్​

రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్​ అన్నారు. కన్నెపల్లి పంప్​హౌజ్​ నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని కోరారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Kaleshwaram Water | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఎక్స్​ వేదికంగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ఒకపక్క నీళ్లు లేక పల్లెల్లో రైతన్నల కన్నీళ్లు పెడుతున్నారని, మరో పక్కక మేడిగడ్డ కాడ లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని కేటీఆర్​ అన్నారు. వానల్లేక.. ఎవుసం జరగక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం దగ్గర పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి.. రైతులకు సాగు నీరు అందించాలన్నారు.

KTR Kaleshwaram Water | పట్టించుకోని ప్రభుత్వం

లోటు వర్షపాతంతో నాట్లు పడట్లేదని, విత్తనాలు వేయట్లేదన్నారు. పంటలు సాగుచేసే పరిస్థితి లేక రైతులు అల్లాడుతుంటే, ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కన్నేపల్లి పంప్ హౌజ్ మోటర్లను నడిపించి ప్రాజెక్ట్​లు నింపాలని కోరారు. కేసీఆర్ మీద కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం సరికాదన్నారు.

KTR Kaleshwaram Water | రైతులను ఆగం చేయొద్దు

KTR Kaleshwaram Water

ఇంకెన్నాళ్లు కాళేశ్వరం మీద దుష్ప్రచారాలు చేస్తూ కాలక్షేపం చేస్తారని కేటీఆర్​ అన్నారు. ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా అని ప్రశ్నించారు. పగలు.. ప్రతీకారాలు ప్రతిపక్షం మీద తీర్చుకోండి, రైతును మాత్రం ఆగం చేయొద్దని కోరారు.

ఇది కూడా చదవండి..: Pawan Kalyan Fan Death | పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్ కన్నుమూత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *