Revanth Reddy Challenge | దమ్ముంటే అసెంబ్లీకి రా.. కేసీఆర్​కు సీఎం రేవంత్​ సవాల్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Challenge | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​కు సవాల్​ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీకి రా..నీ పదేండ్ల పాలన, నా రెండేళ్ల పాలనపై చర్చిద్దాం అన్నారు.

మహబూబ్​నగర్​ (Mahabubnagar) జిల్లా ఉద్దండాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. తాడు బొంగరం లేని ఇద్దరిని కేసీఆర్​ బయటకు వదిలారని కేటీఆర్​, హరీశ్​రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరి మధ్యనే సఖ్యత లేదు. వాళ్లు మాకు నీతులు చెబుతున్నారని విమర్శించారు.

Revanth Reddy Challenge | బీఆర్​ఎస్​ జెండా ఎగరనివ్వను

పాలమూరు జిల్లాలో రాబోయే ఎన్నికల్లో ఒక్క బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేను కూడా గెలవనివ్వనని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ జెండా దిమ్మలు పూర్తిగా కూలిపోవాలని, అక్కడ కాంగ్రెస్ జెండానే ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు.2034 వరకు కాంగ్రెస్​దే అధికారం.. చేతనైతే కేసీఆర్​ అడ్డుకోవాలన్నారు.

Revanth Reddy Challenge | పాపాలు తీరవు

కరీంనగర్‌ నుంచి వలస వచ్చిన కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. పాలమూరు ప్రజలకు కేసీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చారని, పదేళ్లు రూ.8 లక్షల కోట్లు చేతికిస్తే.. ఏ ఒక్క ప్రాజెక్టును కూడా కేసీఆర్‌ పూర్తి చేయలేదని విమర్శించారు. పాదయాత్ర కాదు పొర్లుదండాలు చేసినా.. మీరు చేసిన పాపాలు తీరవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ నాయకులు చేసిన పాపాలను జిల్లా ప్రజలు మరిచిపోరన్నారు.

congress 1

Revanth Reddy Challenge | పేరు మార్చుకుంటా…

డబుల్‌ బెడ్‌రూమ్‌లు కట్టిన చోట ఓట్లు అడగాలని బీఆర్​ఎస్​ నేతలకు రేవంత్​రెడ్డి సవాల్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన దగ్గర తాను ఓట్లు అడుగుతా అన్నారు. బీఆర్​ఎస్​ నాయకులకు డిపాజిట్లు వస్తే తన పేరు మార్చుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలను బాగా చదివించాలని ఆయన సూచించారు. పాలమూరు జిల్లాల్లో విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. అనేక హామీలు ఇచ్చి బీఆర్​ఎస్​ నాయకులు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ రోజు తాము పనులు చేస్తుంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు.

 

దీనిని కూడా చదవండి : Palamuru Irrigation Projects | కమీషన్ల కోసమే వేల కోట్లు దోచుకున్నారు.. బీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *