Parliament Deadlock | పార్లమెంట్‌లో వాయిదాల పర్వం.. రాహుల్‌ గాంధీతో కిరణ్ రిజిజు భేటీ

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మూడో వారంలోనూ వాయిదాల పర్వంతో కొనసాగుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Parliament Deadlock | పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మూడో వారంలోనూ వాయిదాల పర్వంతో కొనసాగుతున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జీ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్వయంగా సభలో ప్రకటన చేయాలని, అయోధ్య రామమందిర విరాళాల చోరీపై కేంద్రం స్పందించాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు నినాదాలు చేస్తుండటంతో ఉభయ సభలు పదే పదే వాయిదా పడుతున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది.

Parliament Deadlock | సభలు సజావుగా సాగేలా..

ఈ నేపథ్యంలో ప్రభుత్వం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ( Rahul Gandhi )సమావేశమయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలోని రాహుల్ గాంధీ చాంబర్‌లో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. సభలు సజావుగా సాగేలా సహకరించాలని కోరేందుకు నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ భేటీ తర్వాతైనా సభ సజావుగా సాగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి:  Jharkhand Student Protests | జార్ఖండ్​లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *