Kiran Rijiju Amit Shah | అమిత్ షా ఎప్పుడూ పెల్లెట్ ఫైరింగ్‌కు ఆదేశించలేదు: కిరణ్ రిజిజు

పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kiran Rijiju Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా Amit Shah ఎప్పుడూ పెల్లెట్ ఫైరింగ్‌కు ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. పోలీసులు చట్ట ప్రకారం తమ విధులను నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ప్రతిపక్షాలు పదేపదే అడ్డంకులు సృష్టించాయని రిజిజు ఆరోపించారు. సభలో ప్రతిపక్ష సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని, పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే తమ బాధ్యత అన్నట్టుగా కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించారని విమర్శించారు.

Kiran Rijiju Amit Shah | అడ్డుకోవడం సరికాదు..

పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను చర్చించేందుకు పార్లమెంట్ వేదికగా ఉండాలని, సభ సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని రిజిజు పేర్కొన్నారు.

Nepal Floods | నేపాల్ వరదల్లో 105 మంది భారతీయుల గల్లంతు

అమిత్ షా పెల్లెట్ ఫైరింగ్‌కు ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలను ఆయన ఖండిస్తూ, పోలీసుల చర్యలు చట్ట నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని వెల్లడించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *