Tesla Experience Center | హైదరాబాద్​లో టెస్లా ఎక్స్​పీరియన్స్​ సెంటర్​ ప్రారంభం

హైదరాబాద్​లో టెస్లా సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్​ను ప్రారంభించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tesla Experience Center |  హైదరాబాద్ (Hyderbad) IT హబ్‌లో టెస్లా సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం అయింది. 2026 మోడల్ Y ప్రీమియం RWD, మోడల్ Y వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. హైదరాబాద్ వేదికగా టెస్లా నెక్స్ట్ జనరేషన్ ఈవీ కార్ల విజువల్స్‌ను ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ పంచుకున్నారు.

ఈ సెంటర్లో టెస్లా కార్లను దగ్గరగా చూసే అవకాశం, వాటి ఫీచర్లు తెలుసుకునే అవకాశం ఉంది. మాదాపూర్‌ (Madhapur)లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ దేశంలో ఐదోది. ఈ కొత్త సెంటర్‌లో 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్, మోడల్ వై ఎల్ కార్లను జూన్ 17 నుంచి ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు టెస్లా అడ్వైజర్లు మార్గనిర్దేశం చేస్తారు. అలాగే కార్లను దగ్గరగా అనుభవించే ఇమర్సివ్ ప్రొడక్ట్ అనుభవాలు కూడా పొందవచ్చు.

car

Tesla Experience Center | జులై నుంచి డెలివరీలు

టెస్లా ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను నిర్వహిస్తోంది. కొత్తగా వచ్చిన 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ కారులో 2,138 లీటర్ల స్టోరేజ్ స్థలం ఉంది. ఇందులో ఐదుగురు కూర్చోవచ్చు. ఈ కారు 5.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని ధర రూ.50.89 లక్షలు. కారు డెలివరీలు జులై నుంచి మొదలవుతాయి.

 దీనిని కూడా చదవండి : Etela Rajender Cantonment | కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది : ఈటల రాజేందర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *