RCB Thriller Victory | చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబైకి షాక్ ఇచ్చిన ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ నుండి ఆ రెండు జ‌ట్లు ఔట్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RCB Thriller Victory | గ‌త రాత్రి ముంబై, ఆర్సీబీ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను పంచింది.ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ (RCB) అద్భుత పోరాటంతో విజయం సాధించింది.

రాయ్‌పూర్‌లో జరిగిన ఈ కీలక మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి అభిమానులను సీట్ల అంచులపై కూర్చోబెట్టింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. ఆర్‌సీబీ స్టార్ పేసర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ (Bhuvaneshwar Kumar) తన స్వింగ్ మాయాజాలంతో ముంబై టాప్ ఆర్డర్‌ను చిత్తు చేశాడు. ముఖ్యంగా ఒకే ఓవర్‌లో రోహిత్ శ‌ర్మ‌, సూర్యకుమార్ యాద‌వ్ వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు తిప్పాడు.

RCB Thriller Victory | థ్రిల్ల‌ర్ మ్యాచ్..

ఆరంభంలో వికెట్లు కోల్పోయినా తిల‌క్ వ‌ర్మ‌ Tilak Varma, నమన్ ధీర్ కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కు 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పోటీలో నిలబెట్టారు. తిలక్ వర్మ అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, చివరి ఓవర్లలో భువనేశ్వర్ మరోసారి విజృంభించి కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. భువీ నాలుగు వికెట్లతో మ్యాచ్ హీరోగా నిలిచాడు. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి కూడా మొదట్లోనే కష్టాలు ఎదురయ్యాయి. ముంబై పేసర్ దీప‌క్ చాహ‌ర్ (Deepak Chahar) అద్భుత బౌలింగ్‌తో విరాట్ కోహ్లీని డకౌట్ చేసి షాక్ ఇచ్చాడు. కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సున్నాకే వెనుదిరగడం అభిమానులను నిరాశపరిచింది.

RCB Thriller Victory | ఆదుకున్న కృనాల్, జాకబ్ బెథెల్

తర్వాత పడిక్కల్, కెప్టెన్ ర‌జ‌త్ ప‌టిదార్ కూడా త్వరగా అవుట్ కావడంతో ఆర్‌సీబీ ఒత్తిడిలో పడింది. ఈ దశలో కృనాల్ పాండ్యా, యువ ఆటగాడు జాకబ్ బెథెల్ జట్టును ఆదుకున్నారు. కృనాల్ కేవలం 32 బంతుల్లో మెరుపు అర్ధసెంచరీ సాధించి మ్యాచ్‌ను మళ్లీ ఆర్‌సీబీ వైపు తిప్పాడు. కాలి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కృనాల్ ధైర్యంగా ఆడుతూ 18వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాది జట్టుకు ఆశలు కల్పించాడు. చివరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి.

ఈ సమయంలో రాజ్ అంగద్ బావా వేసిన ఓవర్‌లో రొమారియో షెపర్డ్ వికెట్ కోల్పోయినా, క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ తొలి అవకాశంలోనే భారీ సిక్సర్ బాది మ్యాచ్‌ను మళ్లీ ఉత్కంఠకు తెచ్చాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో రసిఖ్ సలాం ఒత్తిడిని జయించి రెండు పరుగులు పూర్తి చేయడంతో ఆర్‌సీబీ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఈ విజయంతో ఆర్‌సీబీ క్వాలిఫైయర్-2లోకి దూసుకెళ్లగా, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 ప్రయాణం ముగిసింది. మ‌రో మ్యాచ్‌లో ల‌క్నోపై చెన్నై విజ‌యం సాధించ‌డంతో ఎల్ఎస్‌జీ జ‌ట్టు కూడా ప్లేఆఫ్స్ నుండి నిష్క్ర‌మించింది.

ఇది కూడా చదవండి..: IPL Playoff Race | ఆస‌క్తిక‌రంగా మారుతున్న ఐపీఎల్​ ప్లే ఆఫ్ పోరు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *