క్రీడలుVirat Kohli Head Clash | మైదానంలో కోహ్లీ–హెడ్ మధ్య హీట్.. స్లెడ్జింగ్‌తో మొదలైన మాటల...

Virat Kohli Head Clash | మైదానంలో కోహ్లీ–హెడ్ మధ్య హీట్.. స్లెడ్జింగ్‌తో మొదలైన మాటల యుద్ధం, షేక్​హ్యాండ్ ఇవ్వని విరాట్

ఆర్సీబీ - హైదరాబాద్ మ్యాచ్‌లో పరుగుల పోరుతో పాటు మైదానంలో మాటల యుద్ధం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Virat Kohli Head Clash | ఐపీఎల్ మ్యాచ్‌లు కేవలం బ్యాట్, బాల్ మధ్య పోరాటాలకే పరిమితం కావు. కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య జరిగే మాటల యుద్ధాలు కూడా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 256 పరుగుల టార్గెట్‌తో ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ క్రీజులోకి దిగారు. మ్యాచ్ మొదటి ఓవర్ నుంచే మైదానంలో వేడి వాతావరణం కనిపించింది. తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీపై స్లెడ్జింగ్‌కు దిగినట్లు తెలుస్తోంది. దీంతో కోహ్లీ తనదైన శైలిలో ఘాటుగా స్పందించినట్లు ప్రచారం సాగుతోంది. “నువ్వే వచ్చి బౌలింగ్ చేయి” అంటూ హెడ్‌కు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Virat Kohli Head Clash | వ్యంగంగా స్పందించిన కోహ్లీ..

అంతేకాకుండా కోహ్లీ మరో ఆసక్తికర సైగ కూడా చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హెడ్ వైపు చూస్తూ “ఇంపాక్ట్ ప్లేయర్” సిగ్నల్ చూపించాడని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్‌ (Travis Head)ను తరచూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించిన నేపథ్యంలో, “బ్యాటింగ్ అయిపోయింది కదా.. ఇప్పుడు వెళ్లి కూర్చో” అనే అర్థంలో కోహ్లీ వ్యంగ్యంగా స్పందించినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనతో మ్యాచ్ సమయంలో మైదానం ఒక్కసారిగా హీటెక్కింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో క్లిప్స్ వైరల్ అవుతూ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

Virat Kohli Head Clash | క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌

అయితే మ్యాచ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపించింది. ట్రావిస్ హెడ్  ఈ వివాదాన్ని పెద్దగా పట్టించుకోకుండా సాధారణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చిన హెడ్‌ను కోహ్లీ పట్టించుకోలేదనే చర్చ కూడా సోషల్ మీడియా (Social Media)లో సాగుతోంది. అయితే మైదానంలో ఇలాంటి సంఘటనలు క్రికెట్‌లో భాగమేనని, మ్యాచ్ సమయంలో ఉన్న పోటీ తత్వం కారణంగా ఇలాంటి వేడి క్షణాలు కనిపించడం సహజమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ–హెడ్ మధ్య జరిగిన ఈ ఘటన క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి..: IPL 2026 Points Table | ఐపీఎల్ 2026లో సంచలనం.. టేబుల్ టాపర్‌గా ఆర్సీబీ, సేమ్ పాయింట్స్‌తో మూడు జట్లు అరుదైన రికార్డు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

AI Complaint App | ఏఐతో ఫిర్యాదుల నమోదు.. హైదరాబాద్​ పోలీసుల కీలక అడుగు

అక్షరటుడే, వెబ్​డెస్క్: AI Complaint App | హైదరాబాద్ పోలీసులు (Hyderabad...

Bajaj Pulsar N160 | బజాజ్ పల్సర్ కొత్త వేరియంట్ లాంచ్ ..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bajaj Pulsar N160 | భారతదేశ టూ వీలర్...

Hyderabad Lawyer Murder | హైదరాబాద్​లో న్యాయవాది హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Lawyer Murder | హైదరాబాద్​లో ఓ న్యాయవాది...

POLYCET Results | పాలిసెట్​ ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: POLYCET Results | తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి....