Telangana RTC Strike 1 | డిపోల్లోనే ఆర్టీసీ బస్సులు.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికుల పాట్లు!

Naresh Chandan
Telangana RTC Strike 1

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana RTC Strike 1 | ప్రభుత్వ కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలం కావడంతో తెలంగాణలో ఆర్టీసీ బంద్‌ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు కదలడం లేదు.

akshara today .jpgRTC
Telangana RTC Strike 1

Telangana RTC Strike 1 | డిపోల ఎదుట ఆందోళనలు

హైదరాబాద్​లో నిన్న రాత్రి నుంచే కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ నేడు ఉదయం కార్మికులు డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు.

ఆటోలకు డిమాండ్​..

రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సుమారు 35 లక్షల మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు.

కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే మహిళలతో పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి.

దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేందుకు పాట్లు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెతో ఆటోలకు డిమాండ్​ ఏర్పడింది. దీంతో ఆటోవాలాలు ఛార్జీలు పెంచేశారు.

ఇది కూడా చదవండి: April 22 Horoscope | రాయల్టీలతో కాసుల వర్షం.. ఈ రాశుల వారికి తలుపు తట్టబోతున్న అదృష్టం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *