BJP President comments | ‘కాక్రోచ్​ పార్టీ’ వెనక అర్బన్​ నక్సల్స్​.. బీజేపీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP President comments | సోషల్​ మీడియాలో కాక్రోచ్​ జనతా పార్టీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు అంశాలపై ఈ పార్టీ స్పందిస్తోంది. ఈ పార్టీపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు స్పందించారు.

కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్ ఉన్నారని రాంచందర్​రావు అన్నారు. ఆయన గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. ఈ కాక్రోచ్‌లను ‘హిట్’ కొట్టి చంపేస్తామన్నారు. జెన్​జీ యువత భారత్​ కోసం పనిచేస్తారన్నారు. విదేశాల నుంచి ఫండింగ్​ వచ్చే వారు చెప్పినట్లు వినరని పేర్కొన్నారు.

BJP President comments | బీజేపీ సూపర్​ హీరో

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సూపర్ హీరో అని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ భూతాలని విమర్శించారు. బండి భగీరథ్​ ఇష్యూతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్, ఈటల, ధర్మపురి అర్వింద్ మంచిగానే ఉన్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవ్వడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.13 లక్షల కోట్ల నిధులు ఇచ్చి తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసిందని తెలిపారు.

BJP President comments | మీటింగ్​ పెట్టుకునే హక్కు ఉంది

పవన్ కల్యాణ్ సభకు పర్మిషన్ ఇస్తే అసలు ఇష్యూనే అయ్యేది కాదని బీజేపీ అధ్యక్షుడు అన్నారు. మీటింగ్ పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుందన్నారు. ప్రధాని మోదీ చంద్రబాబు, పవన్ ఇళ్లకు వెళ్తేనే కొంతమందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు తెలంగాణను వ్యతిరేకించిన MIMతో దోస్తీ చేస్తూ, అలాంటి వాళ్లను మీ పార్టీలో చేర్చుకోలేదా అని ఆయన బీఆర్​ఎస్​ను ప్రశ్నించారు. పవన్​ ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.

BJP President comments | బీజేపీతోనే తెలంగాణ వచ్చింది

బీజేపీతోనే తెలంగాణ వచ్చిందని రాంచందర్​రావు అన్నారు. బిల్లు పాస్​ అయిన సమయంలో బీఆర్​ఎస్​ ఎంపీలు కేసీఆర్​, విజయశాంతి సభలోనే లేరన్నారు. పప్పెర్ స్ప్రేలు కొట్టినా.. తెలంగాణ బిల్లుకు బీజేపీ బేషరతుగా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో BJP పాత్రను ఎవరూ విస్మరించలేరు.. అది చరిత్రలో నమోదైన వాస్తవం అని పేర్కొన్నారు. ఎస్​ఐఆర్​ ఎన్నికల సంఘం చేపట్టే ప్రక్రియ అన్నారు. గతంలో 2002లో ఎస్​ఐఆర్​ జరిగిందన్నారు. అప్పుడు రాహుల్​ గాంధీ బచ్చాగాడన్నారు.

దీనిని కూడా చదవండి : ACB Raids Bhujangarao | భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *