ACB Raids Bhujangarao | భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids Bhujangarao | మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు (సస్పెన్షన్​లో ఉన్నారు) ఇళ్లల్లో ఏసీబీ (ACB) సోదాలు ముగిశాయి. ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case)లో కీలక నిందితుడు అయిన ఆయన నివాసంతో పాటు మరో 15 చోట్ల బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భుజంగరావును అరెస్ట్ చేశారు.

నాయిని భుజంగ రావు తన సర్వీసు కాలంలో అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా తనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినందున, ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. బుధవారం అతని నివాసంలో, బంధువులు, బినామీదార్లు, ఇతర సహచరులకు చెందిన మరో 15 ప్రదేశాలలో ఏసీబీ సోదాలు చేపట్టింది. తనిఖీల్లో సూర్యాపేట, నల్గొండ (Nalgonda) జిల్లాల్లోని 27.29 ఎకరాల వ్యవసాయ భూమికి, హైదరాబాద్‌లోని ఐదు ఖాళీ స్థలాలకు, రెండు ఇళ్లకు, ఒక వాణిజ్య భవనానికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ACB Raids Bhujangarao | కిలో బంగారం లభ్యం

సోదాల సమయంలో నిందితుడి ఇంట్లో సుమారు రూ. 3.83 లక్షల నగదు, రూ. 8 లక్షల బ్యాంకు నిల్వలు, దాదాపు 1 కేజీ బరువున్న బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. ఒక మారుతి స్విఫ్ట్ కారు, ఒక కియా సెల్టోస్ కారు ఉన్నట్లు గుర్తించారు. గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ. 5,92,54,500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే మార్కెట్ రేట్​ ప్రకారం వీటి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

దీనిని కూడా చదవండి : Sangareddy Drugs Bust | మారుమూల గ్రామంలో ఫామ్​హౌస్​.. లోపల ఏం జరగుతుందో తెలిస్తే షాక్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *