Lal Bahadur Shastri | లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం

మాజీ ప్రధాని లాల్​బహదూర్​ శాస్త్రి, గాంధీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Lal Bahadur Shastri | మాజీ ప్రధాని లాల్​బహదూర్​ శాస్త్రి, మహాత్మ గాంధీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా (Bigala Ganesh Gupta) పేర్కొన్నారు. లాల్​ బహదూర్​ శాస్త్రి, గాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించారు.

Lal Bahadur Shastri | ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ..

Lal Bahadur Shastri

గణేష్ బిగాల మాట్లాడుతూ.. దేశం కోసం లాల్ బహదూర్ శాస్త్రి చేసిన సేవలు, ఆయన చూపిన నిజాయితీ, నిరాడంబరత, దేశభక్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. దేశ ప్రజల్లో ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ, దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ ఆహార భద్రతలో రైతుల ప్రాధాన్యతను శాస్త్రి గారు చాటి చెప్పారని గణేష్ బిగాల అన్నారు. అలాగే మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సహనం, సేవామార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

దేశ స్వాతంత్య్రం  కోసం గాంధీజీ చేసిన త్యాగాలు, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఆయన నాయకత్వం భారత చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, జగత్ రెడ్డి, గాండ్ల లింగం, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Municipality Vigilance | కామారెడ్డి బల్దియాలో విజిలెన్స్ విచారణ..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *