అక్షరటుడే, బాన్సువాడ: Former Sarpanch Murder | మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వర్ని మండలంలో కలకలం రేపింది.
Former Sarpanch Murder | తగిలేపల్లి గ్రామంలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం (Varni Mandal)లోని తగిలేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటేష్ అలియస్ వెంకన్న(55)కు.. అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బక్క నారాయణకు భూ వివాదం ఉంది. వీరు ఇద్దరు సర్వే నంబర్ 392లో సాగు చేస్తున్నారు. అయితే ఈ సర్వేనంబర్‌లో వెంకన్న ఆరు ఎకరాల్లో సాగు చేస్తుండగా.. బక్క నారాయణ రెండెకరాల్లో పంట పండిస్తున్నారు. అయితే తనకు మరో రెండు ఎకరాలు ఇవ్వాలని నారాయణ.. ఇచ్చేది లేదని వెంకన్న తరచూ గొడవ పడేవారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో సైతం నారాయణ ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం పొలం వద్ద వీరిద్దరికి మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బక్క నారాయణ వెంకన్నను గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం మంగళవారం ఉదయం 5.30గంటలకు వర్ని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rice Millers Vigilance Raids | రైస్ మిల్లులపై విజిలెన్స్ పంజా.. రెండు రైస్ మిల్లర్ల యజమానుల అరెస్ట్..?