MLA Dhanpal | కాంగ్రెస్​ను ఎదుర్కొనే దమ్ములేక నాపై ఆరోపణలు: ఎమ్మెల్యే ధన్​పాల్​

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | అవినీతి, అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్(Former MLA Bigala) తనపై ఆరోపణలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

MLA Dhanpal | అవగాహన లేక ఆరోపణలు

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గ (Nizamabad Urban Constituency) ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బిగాల నగరానికి ఎప్పుడో ఒకసారి వస్తున్నారన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోను 60 స్థానాల్లో ఒకటే సీటును గెలుపొంది, కనీసం ఆ ఒక్క సీటును కూడా కాపాడుకోలేని అసమర్ధత నాయకుడు బిగాల అని ఎద్దేవా చేశారు. తాను గెలిచిన తర్వాత గతంలో ఉన్న పెండింగ్ పనులపై అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్నానన్నారు. ఇది జీర్ణించుకోలేని బిగాల అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

MLA Dhanpal | పదేళ్లు అధికారంలో ఉండి..

బిగాల పదేళ్లు అధికారంలో ఉన్నా అర్బన్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్​రూమ్ కూడా ఇప్పించలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రశాంత్ రెడ్డి ఉన్నారని, ఆయనను రాజీనామా చేయమని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అలాగే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్​లో ఒక్క ప్రముఖ కంపెనీ కూడా తీసుకు రాలేదని మరి కేటీఆర్​ని రాజీనామా చేయమని నిలదీశావా అని ప్రశ్నించారు. కేవలం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే పని చేశావే తప్ప.. నిజామాబాద్ అభివృద్ధికి కాదని ఆరోపించారు. కమీషన్, కరప్షన్, కలెక్షన్​కు అలవాటు పడి పదేళ్లు పాలించారని విమర్శించారు. ఇటీవల తాను మంత్రులపై ఒత్తిడి తేవడంతో నగరంలో 396 డబుల్​ బెడ్​రూం(Double Bedroom) ఇల్లు కేటాయించారన్నారు. అలాగే మరో వారంలో నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ను కలుస్తున్నట్లు తెలిపారు.

MLA Dhanpal | మినీ ట్యాంక్​ బండ్​పై..

ఇటీవల నగరంలోని మినీ ట్యాంకుబండ్​పై బిగాల గణేష్ గుప్తా అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాడని ధన్​పాల్​ చెప్పారు. ట్యాంక్ బండ్ కాంట్రాక్టర్ సమయం ముగియడంతో తాళాలు వేసి వెళ్లారన్నారు. కొత్త కాంట్రాక్టర్ నియమంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, కార్పొరేషన్ పై ఉందన్నారు. అదే మినీ ట్యాంక్ బండ్​పై ఏర్పాటుచేసిన చెట్లలో అవినీతికి పాల్పడ్డ చరిత్ర బిగాలది అన్నారు. రూ. 4,500 చెట్టును రూ.45 వేలుగా చూపించి దోచుకున్నారన్నారు. అలాగే కార్పొరేషన్​లో ఒక్క మనిషి విధులు నిర్వహించుకున్నా.. 330 మంది పనిచేస్తున్నట్లు రికార్డుల్లో చూయించి నెలకు రూ.50 లక్షలు దోచుకున్నారన్నారని ఆరోపించారు.

MLA Dhanpal | చర్చకు సిద్ధం..

ఏ శాఖలో అయినా తాను ఒక్కరూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న గణపతి ఆలయం ముందుకు తాను వస్తానని చెప్పారు. తన హయాంలో ఒక్క గుంట భూమి కొనుగోలు చేయలేదని, బిగాల మాత్రం ఒక్క గుంట కూడా విడిచిపెట్టలేదన్నారు. అలాగే ఆర్యవైశ్యులు అంటే దానధర్మాలకు ప్రతిక అని, కానీ బిగాల మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాడన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, కల్పె అర్చన చిరంజీవి, మమత శివ, సీనియర్ నాయకులు న్యాలం రాజు, పుట్ట వీరేందర్, బీజేవైఎం రాష్ట్ర కో కార్యదర్శి విజయ్, ఇల్లెందుల ప్రభాకర్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

dhanpal1

city

ఇది కూడా చదవండి: El Nino Impact Telangana | ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించండి: మంత్రి తుమ్మల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *