అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR on Drought | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అభినవ నిరో చక్రవర్తి, అభినవ నిర్లక్ష్య చక్రవర్తి రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ భవన్లో కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం ఉందా.. రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రం కరువులో ఉందంటూ, మరోవైపు లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తున్నారని విమర్శించారు. మూసీ భూ సేకరణకు పబ్లిక్ హియరింగ్ చేస్తున్నామని అన్నారు కానీ అక్కడ ప్రజలే లేరని చెప్పారు. పబ్లిక్ హియరింగ్‌కు వెళ్తున్న తమ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డిని, సుధీర్ రెడ్డిని, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ను, నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం ఉందా అన్నారు.
KTR on Drought | నీళ్లు ఒడిసి పట్టలేదు
ఏపీలో లేని కరువు తెలంగాణలో ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. నీళ్లు ఒడిసిపట్టమని తాము గతంలో చెబితే, తమ మీద కోపంతో నీళ్లను కిందకు వదిలేశారన్నారు. ఏపీలో పట్టిసీమ దగ్గర గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి చంద్రబాబు నాయుడు కరువు లేకుండా చేశారని చెప్పారు. అహంకార భావంతో నీళ్లు ఎత్తిపోయకుండా 9 జిల్లాలను రేవంత్ రెడ్డి ఎండబెట్టారన్నారు.
KTR on Drought | డీపీఆర్ లేకుండానే..
డీపీఆర్ లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీపై ముందుకు వెళ్తొందని కేటీఆర్ విమర్శించారు. పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ మొదటి దశ అంటున్న ప్రభుత్వం.. మొత్తం ఎన్ని ఫేజ్‌లు ఉంటాయో మాత్రం చెప్పడం లేదన్నారు. మూసీ ప్రక్షాళన ముసుగులో లూటీకి తెరలేపారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: PCC Chief Mahesh Goud | రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం : పీసీసీ చీఫ్