Heavy Rains | భారీ వర్షం.. రైతన్న హర్షం

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో వాన దంచి కొట్టింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వానాకాలం సీజన్​ మొదలై నెల దాటిపోయింది. అయినా భారీ వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులను వరుణుడు కరుణించాడు. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వాన పడింది. రానున్న రెండు రోజులు సైతం వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అన్నదాతలు వ్యవసాయ పనులకు సమాయత్తం అవుతున్నారు.

rain

Heavy Rains | జోరందుకోనున్న సాగు పనులు

ఎల్​నినో (El Nino) ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచించారు. అయినా రాష్ట్రంలో ఎప్పటిలాగే ఎక్కువ మంది రైతులు వరి (Paddy) సాగు చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే వర్షాలు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వరినార్లు పోసుకొని వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. భారీ వర్షాలు పడితే నాట్లు వేసుకుందామని భావిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పడిన వర్షంతో (Heavy Rains) వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా వరినాట్లలో రైతులు బిజీ కానున్నారు. మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే.. పంటల సాగుకు మేలని అన్నదాతలు పేర్కొంటున్నారు.

 

దీనిని కూడా చదవండి : Police Jobs Telangana | 20 వేల పోలీస్​ ఉద్యోగాలను భర్తీ చేయాలి : కేటీఆర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *